NBK 112: నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమాలంటేనే మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఇక బాలయ్యను తనదైన స్టైల్‌లో చూపించే దర్శకుడు కొరటాల శివ అయితే ఆ అంచనాలు మరింత పెరగడం ఖాయం. తాజాగా, వీరిద్దరి కాంబినేషన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య?
కొరటాల శివ తన సినిమాల్లో హీరో పాత్రలను కేవలం మాస్ యాక్షన్‌కే పరిమితం చేయకుండా బలమైన కథ, ఎమోషన్‌తో డిజైన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బాలయ్య కోసం కూడా రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలను సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఒక పాత్రలో పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తే.. మరో పాత్రలో పూర్తిగా భిన్నమైన గెటప్, బాడీ లాంగ్వేజ్‌తో బాలయ్య కనిపించనున్నారనే వార్త వినిపిస్తోంది. ఈ రెండు పాత్రలకు కథలో సమానంగా బలం ఉంటుందని తెలుస్తోంది.
గతంలో రెండు పాత్రల్లో అలరించిన బాలయ్య:
సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, అఖండ 2 లాంటి సినిమాలలో బాలయ్య రెండు రకాల పాత్రల్లో కనిపించి అదరగొట్టాడు. ఇలాంటి, కథలు బాలయ్యకి వరుస హిట్స్‌ని ఇచ్చాయి. ఈ క్రమంలోనే మరోసారి కొరటాల సినిమాలో డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్‌పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2027, సమ్మర్ కానుకగా భారీ స్థాయిలో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. 150 నుంచి 200 కోట్ల బడ్జెట్‌తో ఎన్‌బికే 112 రూపొందనుందని సమాచారం.
ప్రస్తుతం బాలయ్య 111వ సినిమాదా దాదా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 24న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే, దాదా సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్..టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. గత చిత్రం అఖండ 2 ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో..ఈ సినిమాతో మళ్ళీ భారీ హిట్ కొట్టాలని బాలయ్య కసితో ఉన్నాడు.


