National

UPI : యూపీఐపై ఎండీఆర్ చార్జీలు.. కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు షాక్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

యూపీఐ లావాదేవీలు రూ.2 వేలకు మించితే చార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నిరుపేదలు, చిరు వ్యాపారులను దోచుకునేందుకు కేంద్రం చార్జీలు వసూలు చేస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

యూపీఐ లావాదేవీలు రూ.2 వేలకు మించితే చార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నిరుపేదలు, చిరు వ్యాపారులను దోచుకునేందుకు కేంద్రం చార్జీలు వసూలు చేస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ వివాదం కాస్త సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడంతో కేంద్రప్రభుత్వం, ఆర్బీఐకి న్యాయస్థానం షాక్ ఇచ్చింది.

రూ.2 వేలకు మించిన యూపీఐ (UPI) చెల్లింపులపై ఎండీఆర్‌ (MDR) చార్జీల విధింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ వివాదాస్పద అంశంపై స్పందించాలని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కాగా, రూ.2 వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్‌ విధిస్తూ ఈనెల 14న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ లావాదేవీలపై ప్రభావం చూపుతుందని భావిస్తూ న్యాయవాది అంజన్ దత్తా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కొత్త నిబంధనల వలన వ్యాపారులు అదనపు భారాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని వాదించారు. ఇది పరోక్షంగా వినియోగదారులపై, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేంద్రం, ఆర్బీఐ, ఎన్‌పీసీఐకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్రం కౌంటర్ దాఖలు చేశాక తదుపరి విచారణలో యూపీఐ చార్జీలపై మరింత స్పష్టత రానుంది.

ఇదిలాఉండగా, దేశ వ్యాప్తంగా అక్టోబర్ 15 నుంచి కొత్త ఎండీఆర్ అమల్లోకి రానుంది. రూ.2 వేలలోపు ఉన్న లావాదేవీలు, అలాగే వ్యక్తిగత బదిలీలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయని కేంద్రం ఇప్పటికే స్పష్టంచేసింది. డిజిటల్ పేమెంట్స్ మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడానికి ఈ ఛార్జీలు దోహదపడతాయని ప్రభుత్వ, నియంత్రణ వర్గాలు వాదిస్తున్నాయి.కాగా, అమెరికా ఒత్తిడికి తలొగ్గే కేంద్రం యూపీఐ మీద చార్జీలు విధిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

#UPI#MDR#Charges#banks#supreamcourt#notice#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి