సినిమా

Slum Dog: అమ్మ ఉన్నది అడుక్కోవాడానికి కాదు అన్నం పెట్టడానికి..

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Slum Dog: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నుంచి వస్తున్న మరో డిఫరెంట్ మూవీ ‘SlumDog: 33 Temple Road’. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్, మిస్టరీ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు, సంయుక్త, దునియా విజయ్, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా, ఈ సినిమా నుంచి జరీనా వహాబ్ పాత్రను రివీల్ చేస్తూ వీడియోను వదిలారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. జరీనా వహాబ్ పోషిస్తున్న ‘జుబైదా’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘‘ప్రేమతో నిండిన హృదయం.. కష్టాలతో నిండిన జీవితం’’ అనే కాన్సెప్ట్‌తో ఆమె పాత్రను పరిచయం చేశారు. అంతేకాదు, ఆమె పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ కూడా విడుదలైంది.

ఇక, తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ లో నాంపల్లి టేషన్ దగ్గర ట్రైన్ కింద తలపెట్టి చనిపోదాం అనుకున్నా.. కానీ, ధైర్యం సరిపోలేదు. ఆకలితో ప్రాణాలు పోతుంటే ఆఖరికి నా చేతులు అడుక్కోవడానికి ముందుకొచ్చాయి..అంటూ జుబేదా పాత్ర చెప్పే డైలాగ్స్ ఎంతో బరువైన ఎమోషన్‌ను చూపించింది. ఆ తర్వాత, విజయ్ సేతుపతి ఎంట్రీ ఇవ్వడం.. చూస్తే, తల్లి కోసం ఏమైనా చేస్తాడా.. అనే క్యూరియాసిటి క్రియేట్ అయ్యింది. 'అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు' అని పూరి వాయిస్ తో వచ్చిన డైలాగ్ తాజా గ్లింప్స్ లో హైలెట్ అయ్యింది.

అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి సినిమాలో మదర్ సెంటిమెంట్‌ను అద్భుతంగా చూపించాడు పూరి. అలాగే, లైగర్ సినిమాలోనూ..లోఫర్ సినిమాలోనూ అమ్మ సెంటిమెంట్‌ను చూపించాడు. అయితే, అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి తప్ప మిగతా సినిమాలు ఫ్లాప్ లిస్ట్‌లో చేరాయి. మళ్ళీ, ఇంతకాలానికి అమ్మ సెంటిమెంట్‌తో స్లమ్ డాగ్ రూపొందించినట్టుగా అర్థమవుతోంది. ఇప్పటికే, రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. చూడాలి, మరి మళ్ళీ పూరి హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా.

#Zarina Wahab#Slum Dog 33: Temple Road#Vijay Sethupathi#Puri Jagannadh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి