తెలంగాణ

Harish Rao: ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “ప్రజా పాలన”? పెండింగ్ బిల్లులు ఇంకెప్పుడు చెల్లిస్తారు?- హరీశ్ రావు

రచన: NK••6 నిమిషాల పఠనం

Harish Rao: పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన రాష్ట్ర సచివాలయం కాంగ్రెస్ పాలనలో నిరసనల అడ్డాగా మారడం సిగ్గుచేటు అని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు సచివాలయం వేదికగా ఆందోళనకు దిగాల్సిన దుస్థితి రావడం సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తలదించుకోవాల్సిన విషయం అన్నారు. ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా.. ఇంకెంత కాలం తప్పించుకు తిరుగుతారు? అని రేవంత్ ను నిలదీశారు.

Harish Rao: పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన రాష్ట్ర సచివాలయం కాంగ్రెస్ పాలనలో నిరసనల అడ్డాగా మారడం సిగ్గుచేటు అని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు సచివాలయం వేదికగా ఆందోళనకు దిగాల్సిన దుస్థితి రావడం సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తలదించుకోవాల్సిన విషయం అన్నారు. ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా.. ఇంకెంత కాలం తప్పించుకు తిరుగుతారు? అని రేవంత్ ను నిలదీశారు.

కమీషన్లు ఇవ్వలేదనే బిల్లులు ఆపుతున్నారా?

బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం దారుణం అని హరీశ్ రావు ధ్వజమెత్తారు. పెండింగ్ బిల్లుల మంజూరు కోసం 20-30% కమీషన్ డిమాండ్ చేస్తున్నారంటూ గతంలో సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారని గుర్తు చేసిన హరీశ్ రావు.. అంటే కమీషన్లు ఇవ్వలేదనే కారణంతోనే వారి బిల్లులు ఆపుతున్నారా? అని ప్రశ్నించారు.

ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం ఇదేనా?

రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేస్తామని మే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటలేనా? మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవు అనడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల ఆవేదన వినే సమయం కూడా ఈ ప్రభుత్వానికి లేదా? 30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా?

దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వకపోవడం అమానవీయం

2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? సర్వీసులో దాచుకున్న సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుండటం అమానవీయం, అనైతికం! సమస్యలు వినడానికే సిద్ధంగా లేని ప్రభుత్వం.. పరిష్కారం ఎలా చూపుతుంది? అంటూ ప్రశ్నలు కురిపించారు హరీశ్ రావు.

ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “ప్రజా పాలన”?

''ప్రజల సమస్యలు వినాల్సిన ప్రభుత్వం… ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే పోలీసులతో అడ్డుకునే దుస్థితి ఉందని హరీశ్ రావు వాపోయారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “ప్రజా పాలన”? అని నిలదీశారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అంటూ ప్రజలను మభ్యపెట్టడం.. అధికారంలోకి వచ్చాక ప్రజలకే అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం! ఇది ప్రజా పాలనా? లేక కాంగ్రెస్ మార్క్ వంచనా?'' అంటూ రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు హరీశ్ రావు.

పెండింగ్ బిల్లుల చెల్లించాలని సచివాలయంలో ఆందోళన

సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు మరోసారి ఆందోళన నిర్వహించారు. బిల్లులు ఇస్తారా ఇవ్వరా అంటూ నిలదీశారు. ఎన్నిసార్లు తిరిగినా భట్టి విక్రమార్క తమను కలవడం లేదని వారు వాపోయారు. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భట్టి విక్రమార్కతో అపాయింట్‌మెంట్ ఇప్పించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు. ఈ వ్యవహారంపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

#Harish Rao#Brs#Cm Revanth Reddy#Telangana#Pending Bills#Retired Employs#Contractors#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి