తెలంగాణ

TG : ‘బిల్లులు ఇస్తారా.. ఇవ్వరా?’.. డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు ఆందోళన!

రచన: Mahesh•••3 నిమిషాల పఠనం

TG : సచివాలయంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏళ్లు గడుస్తున్నా తమ పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. "మా బిల్లులు ఇస్తారా.. ఇవ్వరా?" అంటూ నినాదాలు చేస్తూ నేలపై బైఠాయించడంతో సచివాలయ కారిడార్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

బాధితుల వివరాల ప్రకారం.. ఎంతో కాలంగా తమకు రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యను వివరించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా డిప్యూటీ సీఎం అపాయింట్‌మెంట్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అపాయింట్‌మెంట్ ఇప్పించే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు.

సచివాలయం లోపల నిరసనలకు అనుమతి లేకపోవడంతో భద్రతా సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బుల కోసం నిలదీస్తే పోలీసులతో అడ్డుకుంటారా అంటూ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

#Telangana#TG News#Telangana Secretariat#Bhatti Vikramarka#Deputy CM#Finance Minister#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి