క్రైమ్

Gadwal: గద్వాల జిల్లాలో తప్పిన పెను ప్రమాదం.. బోల్తా పడిన బస్సు.. విద్యార్థులకు గాయాలు

రచన: NK•••3 నిమిషాల పఠనం

Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. అయితే, ఈ ఘటనలో విద్యార్థులు అంతా ప్రాణాలతో బయటపడ్డారు. వారికి స్పల్పంగా గాయాలయ్యాయి. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మానవపాడు మండలం బోరవెల్లి స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి NH44పై బస్సు బోల్తా పడింది.

తమిళనాడు రాష్ట్రం సేలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు విహారయాత్రకు హైదరాబాద్ కు వస్తున్నారు. బస్సులో విద్యార్థులు, టీచర్లు అంతా కలిపి 37మంది ఉన్నారు. హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. మానవపాడు మండలం బోరవెల్లి శివారులో జాతీయ రహదారిపై ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది.

Gadwal: గద్వాల జిల్లాలో తప్పిన పెను ప్రమాదం.. బోల్తా పడిన బస్సు.. విద్యార్థులకు గాయాలు

బస్సు పూర్తిగా తిరగబడింది. అయితే, ఆ సమయంలో బస్సు వేగం తక్కువగా ఉండటంతో ఘోర ప్రమాదమే తప్పిందని చెప్పాలి. విద్యార్థులు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను అలంపూర్ చౌరస్తాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Gadwal: గద్వాల జిల్లాలో తప్పిన పెను ప్రమాదం.. బోల్తా పడిన బస్సు.. విద్యార్థులకు గాయాలు

#Bus Overturns#Gadwal#NH 44#Selam#Tamil Nadu#Tourist Bus#School Students#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి