Trivikram: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేసిన తాజా చిత్రం ' ఆదర్శ కుటుంబం - AK47'. తాజాగా ఈ సినిమా నుంచి నారాయణమ్మ సాంగ్ రిలీజై యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇక, వీరి కాంబో అంటే టాలీవుడ్ లో అందరికీ గుర్తొచ్చేవి బ్లాక్ బస్టర్స్ 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చిత్రాలే.
వెంకీ మార్క్ కామెడీ టైమింగ్ కి, త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగులు తెలుగు ప్రేక్షకులను తెగ ఎంటర్‌టైన్ చేశాయి. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ తొలిసారి హీరోగా నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ' ఆదర్శ కుటుంబం - AK47' రూపొందుతోంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక, ఇప్పటికే, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ' ఆదర్శ కుటుంబం - AK47'. సినిమా నుంచి విడుదలైన 'నారాయణమ్మ' సాంగ్ సోషల్ మీడియాలో ఊహించని విధంగా ట్రెండ్ అవుతోంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్ తమన్ సమకూర్చిన హుషారైన బాణీలు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. వెంకటేష్ వింటేజ్ ఎనర్జీతో వేసిన స్టెప్పులు, ముగ్గురు హాట్ బ్యూటీస్ డింపుల్ హయాతీ, నివేదా పేతురాజ్ గ్రేస్‌ఫుల్ మూమెంట్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా, ఈ సాంగ్‌కి భానూ మాస్టర్ కంపోజిషన్ సూపర్బ్ అని చెప్పాలి.
అయితే, దర్శకుడు త్రివిక్రమ్.. డింపుల్ హయాతీపై ప్రశంసల వర్షం కురిపించాడు. డింపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. ‘‘ఈ పాట షూటింగ్ సమయంలో డింపుల్ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడింది. అయినప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ మాస్ బీట్‌కు అదిరిపోయే డ్యాన్స్ చేసింది. డింపుల్ చూపిన్చిన డెడికేషన్ ని మనస్పూర్తిగా అభినందించాలి..అన్నాడు. అంతేకాదు, డింపుల్‌ని ఇలా పాటలో కాకుండా పూర్తి స్థాయి సినిమాలో కలవాలని కోరుకుంటున్నా’..అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, ఈసారి డింపుల్ ని మేయిన్ హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో గురూజీ ఉన్నట్టుగా అర్థమవుతోంది.


