సినిమా

Nayanathara: లేడీ సూపర్ స్టార్ క్రేజీ లైనప్..స్టార్ హీరోలు కూడా తక్కువే!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Nayanathara: సౌత్ ఇండియన్ సినిమా దగ్గర తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్ తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక కథలు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా నయనతార చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు సంబంధించిన సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. 2026–27లో ప్రేక్షకుల ముందుకు రానున్న నయన్ సినిమాలను ఓసారి చూద్దాం.

‘మూక్కుతి అమ్మన్ 2’:

నయనతార కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో మూక్కుతి అమ్మన్ కూడా ఒకటి. ఇప్పుడు ఆ పాత్రలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మూక్కుతి అమ్మన్ 2’ లో నయనతార మరోసారి టైటిల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. ఆర్జే బాలాజీ, ఎన్‌.జె.శరవణన్‌ మొదటి భాగానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

మన్నంగట్టి: సిన్స్ 1960:

నయనతార నటిస్తున్న మరో తమిళ చిత్రం ‘మన్నంగట్టి: సిన్స్ 1960’. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తాజా సమాచారం. టైటిల్‌తోనే పీరియాడిక్ నేపథ్యంపై ఆసక్తిని కలిగిస్తున్న ఈ సినిమా నయనతారకు మరో డిఫరెంట్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.

డియర్ స్టూడెంట్స్:

మలయాళంలో నయనతార నటిస్తున్న సినిమాల్లో ‘డియర్ స్టూడెంట్స్’ కూడా ఒకటి. ఈ చిత్రం కూడా ఆమె రాబోయే సినిమాల జాబితాలో ఉంది. మలయాళ సినిమాల ద్వారా మరోసారి తన నటనను ప్రూవ్ చేసుకునే అవకాశం నయనతారకు దక్కనుంది.

సల్మాన్ ఖాన్‌తో భారీ ప్రాజెక్ట్:

నయనతార కెరీర్‌లో మరో బిగ్ ప్రాజెక్ట్ సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న సినిమా. ప్రస్తుతం SVC 63 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2027 ఈద్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు సల్మాన్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. సల్మాన్ ఖాన్–నయనతార కాంబినేషన్ కావడంతో ఈ సినిమా నేషనల్ లెవెల్‌లో కూడా భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. యాక్షన్, ఎమోషన్‌తో కూడిన భారీ ఎంటర్‌టైనర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

#Nayanathara#South Actress#Lady Super Star Nayanathara#Kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి