సినిమా

Puri-Srinu Vaitla: ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్స్ కలిశారు..హిట్ గ్యారెంటీనా!

రచన: Anshu•••5 నిమిషాల పఠనం

Puri-Srinu Vaitla: పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల..ఇప్పుడు వీరిద్దరికీ బ్లాక్ బస్టర్ గ్యారెంటీగా అవసరం. పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ హిట్ కొట్టలేదు. ఆ హిట్ కోసం ఎంతో తాపత్రయపడుతున్నాడు. అలాగే, ఆగడు సినిమా డిజాస్టర్ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి శ్రీను వైట్ల జార్జి క్రిష్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా, ఈ ఫ్లాప్ డైరెక్టర్స్ ఇద్దరూ ఒకే సెట్‌లో కలిశారు. ఇది, హిట్ కి సంకేతంగా కనిపిస్తోంది.

శర్వానంద్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న జార్జి క్రిష్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. చాలా ఏళ్ల తర్వాత శ్రీను వైట్ల సాలీడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు ఆరాటపడుతూ చేస్తున్న సినిమా ఇది. మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14, 2027న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తైంది. ఇది, సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించింది. మధ్యలో మంచు విష్ణుతో ఢీ 2 ప్రకటించి కూడా డ్రాపైంది ప్రాజెక్ట్. ఇప్పుడు, శ్రీను వైట్లకి జార్జి క్రిష్ సినిమా హిట్ తప్పనిసరి.

ఇక, పూరి జగన్నాధ్ కూడా తన మార్క్ హిట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. పూరి జగన్నాధ్ కి హిట్ అండ్ ఫ్లాప్స్ కొత్తేమీ కాదు. కానీ, ఈసారి మాత్రం తన సినిమాను రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. పాత బకాయిలు చెల్లించలేదని డిస్ట్రిబ్యూటర్స్ అడ్డు పడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి తో స్లమ్ డాగ్ సినిమాను పూర్తి చేసిన పూరి, రిలీజ్ కోసం మాత్రం తంటాలు పడుతున్నాడు.

అసలు, పూరి కెరీర్‌లో ఇలా ఎప్పుడూ జరగలేదు. టబు, సంయుక్త మేనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి మార్క్ కథ-కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అయితే, తాజాగా జార్జి క్రిష్ సెట్స్‌కి పూరి జగన్నాధ్ సడన్‌గా వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల, శర్వానంద్ చాలా సంతోషించారు. కాసేపు సినిమాకి సంబందించిన విషయాలను మాట్లాడుకున్నారు. ఒక ఫ్లాప్ డైరెక్టర్ ఇంకో ఫ్లాప్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి శుభాకాంక్షలు తెలపడం ఎంకరేజ్ చేయడం కాస్త ఆసక్తిరమే అని చెప్పాలి. ఈ సందర్భంగా శ్రీను వైట్ల పెట్టిన ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. ఏదేమైనా వీరిద్దరికీ హిట్ తప్పనిసరి.

#Puri Jagannadh#Srinu Vaitla#Sharwanand#Tollywood#Slum Dog 33 Temple Road#George Krish
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి