సినిమా

Vijay-Rashmika: సినీ తారలే కాదు ఆదర్శ దంపతులు కూడా..

రచన: Anshu••3 నిమిషాల పఠనం

Vijay-Rashmika: మన తెలుగు సినిమా పరిశ్రమలో సెలబ్రిటీలు అభిమానుల కోసం చేయూతను అందిస్తున్న విషయం తెలిసిందే. తమని ప్రాణంగా అభిమానించే వాళ్ళకి అండగా ఉండటం అనేది దాదాపు అందరూ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ళ నుంచి రక్తదానం, నేత్రదానం చేస్తూ వస్తున్నారు. అలాగే, ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తున్నారు. మెగా ఎంకరేజ్‌మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవ గురించి అందరూ మాట్లాడుకున్నారు.

సూపర్ స్టార్ మహేష్ చిన్నారులకి దేవుడు:

సూపర్ స్టార్ మహేష్ ఇప్పటికే, ఎంతోమంది చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించి వారి ప్రాణాలను కాపాడారు. ఇది, సినీ తారలలో ఆయన చేస్తున్న అత్యుత్తమ సేవ అని చెప్పాలి. దీనికి, సంబందించి పనులన్నీ మహేష్ భార్య నమ్రత స్వయంగా దగ్గరుండి చూస్తారు. అలాగే, బుర్రిపాలెం కూడా ఆయన దత్తత తీసుకున్నారు. ఆ ఊరి జనాల కోసం ఎంతో చేస్తున్నారు.

విజయ్-రష్మిక ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేదు:

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఏకంగా 400 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, బెంగళూరు, కొచ్చి, చైన్నై, కొడగు, విజయవాడ..ప్రాంతాల నుంచి మొత్తం 400 కుటుంబాలను ఈ జంట దత్తత తీసుకున్నారు. వారికి కావాల్సిన 13 రకాల వంట సామాన్లను సరఫరా చేస్తున్నారు. వీటిలో, బియ్యం, గోధుమ పిండి, రాగి పిండి, వంట నూనె, పప్పులు వంటివి 13 రకాలున్నాయి. మొత్తానికి, విజయ్-రష్మిక ఇలా 400 కుటుంబాలను దత్తత తీసుకున్న విషయం తెలిసి అభిమానులు, ప్రేక్షకులు పొగడ్తలతో ముంచేస్తున్నారు.

#Vijay Devarakonda#Rashmika Mandanna#Tollywood#Vijay-Rashmika
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి