తెలంగాణ

SRSP: సాగునీటి కోసం రైతులతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన

రచన: NK•••5 నిమిషాల పఠనం

సాగునీటి కోసం తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వెంటనే సాగునీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల రైతులదీ ఇదే పరిస్థితి.

SRSP: సాగునీటి కోసం తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వెంటనే సాగునీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల రైతులదీ ఇదే పరిస్థితి. సాగునీటి కోసం ఆయా ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతుగా నిలిచారు.

కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గాల రైతుల సాగునీటి హక్కుల కోసం ఆయన గళమెత్తారు. పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడినా సాగునీరు అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ పరిధిలోని ఎస్సారెస్పీ డీ-86 కెనాల్‌ దగ్గర రైతులతో కలిసి ఆందోళనకు దిగారు గంగుల కమలాకర్.

స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతులను కెనాల్ వద్దకు తీసుకెళ్లారు గంగుల కమలాకర్. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల రైతులకు సాగునీటి పంపిణీలో వివక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. అనంతరం అధికారులతో చర్చించి 300 క్యూసెక్కుల నీటి విడుదలకు కృషి చేశారు.

అంతకుముందు చొప్పదండి చౌరస్తా నుంచి రైతులను ట్రాక్టర్‌లో ఎక్కించుకుని స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ కెనాల్‌ వద్దకు చేరుకున్నారు గంగుల కమలాకర్. అక్కడ రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మా నీళ్లు మాకే కావాలి’ అంటూ రైతులు నినదించారు. సాగునీరు అందక పంటలు దెబ్బతింటున్నా అధికారులు స్పందించకపోవడంపై గంగుల కమలాకర్ తీవ్రంగా మండిపడ్డారు. కెనాల్‌ వద్దకు చేరుకున్న గంగుల కమలాకర్‌ స్వయంగా రెగులేటరీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అదే సమయంలో ఎస్సారెస్పీ అధికారులతో చర్చలు జరిపి 300 క్యూసెక్కుల నీటిని విడుదలకు కృషి చేశారు.

''రైతుల కోసం పోరాటమే కాదు ఏ త్యాగానికైనా నేను సిద్ధమే. అన్నదాతల కష్టాలు తీర్చేందుకు ప్రాణాలైనా ఇస్తా. రాజకీయ నాయకులకు వివక్ష ఉండొచ్చు. కానీ అధికారులకు వివక్ష ఎందుకు? నీళ్లు ఇచ్చే బాధ్యత మీకు లేదా? మీరు చదువుకున్నది ఎందుకు. అందరికీ సమానంగా నీటి పంపిణీ చేయాల్సిన బాధ్యత అధికారులదే. మా పంటలు ఎండబెడతారా. మేము తెలంగాణలో భాగస్వామ్యం కాదా. మాకు నీళ్లు ఎందుకివ్వరు. మంత్రులు, విప్ లకు మాత్రమే నీళ్లు ఇస్తారా. ప్రతిపక్షంలో ఉంటే ఇవ్వరా. మా ప్రజలు ప్రజలు కాదా. ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు. మేము వెళ్లిపోయాక నీరు బంద్ చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం'' అని అధికారులను హెచ్చరించారు గంగుల కమలాకర్.

#SRSP#Gangula Kamalakar#Irrigation Water#Karimnagar#Choppandi#Farmers#Swechaa News#SRSP Canal
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి