తెలంగాణ

Water Fight: వనపర్తి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. సాగునీటి కోసం రైతుల మధ్య ఘర్షణ

రచన: NK•••3 నిమిషాల పఠనం

Water Fight: వనపర్తి జిల్లాలో సాగునీటి కోసం రెండు గ్రామాల రైతుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. పానగల్ మండలంలో మహ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి రైతులు బీమా కాలువ నీటి పంపిణీ విషయంలో గొడవపడ్డారు.

Water Fight: వనపర్తి జిల్లాలో సాగునీటి కోసం రెండు గ్రామాల రైతుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. పానగల్ మండలంలో మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి రైతులు బీమా కాలువ నీటి పంపిణీ విషయంలో గొడవపడ్డారు.

పానగల్ మండలం మహమ్మదాపూర్ లో బీమా కాలువ కెనాల్ షట్టర్ మూసివేత వివాదానికి దారితీసింది. దీంతో 5 గ్రామాల పొలాలకు సాగునీరు నిలిచిపోయింది. ఆయా గ్రామాల రైతులు కెనాల్ షట్టర్ తెరవడంతో ఇరువర్గాల రైతుల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో మహమ్మదాపూర్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బీమా కాలువ నుంచి 15 రోజుల తర్వాత సాగునీరు విడుదలైంది. అయితే, నీరు దిగువకు విడుదల చేస్తే తమకు సాగునీరు ఉండదు అంటూ స్థానిక రైతులు షట్టర్లు మూసివేశారు. విషయం తెలుసుకున్న దిగువ ప్రాంతాల రైతులు కాలువ దగ్గరికి చేరుకుని షట్టర్ తెరిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల రైతుల మధ్య వివాదం చెలరేగింది. తీవ్ర వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. పోలీసులు, అధికారుల ముందే ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకున్నాయి. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

సాగునీటి పంపిణీ విషయంలో అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని, సమస్యను పరిష్కరించి అన్ని గ్రామాలకు సమానంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి మధ్య బీమా కాలువ ప్రవహిస్తుంది. ఆ కాలువకు జూరాల ప్రాజెక్ట్ ద్వారా నీరు వస్తుంది.

#Water Fight#Wanaparthy#Irrigation Water#Farmers#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి