తెలంగాణ

Pranay Case: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఏ4 నిందితుడు అబ్దుల్ బారీ మృతి!

రచన: Mahesh4 నిమిషాల పఠనం

Pranay Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ అమృత - ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 4వ నిందితుడిగా (A4) జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ గుండెపోటుతో మరణించారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జైలు సిబ్బంది హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు.

జైల్లో గుండెనొప్పి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

చర్లపల్లి జైల్లో ఉన్న అబ్దుల్ బారీకి అకస్మాత్తుగా తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. పరిస్థితి విషమించడంతో అప్రమత్తమైన జైలు అధికారులు వెంటనే అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర వార్డులో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి అతడు మరణించినట్లు వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం బారీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.

హత్య కేసుల్లో బారీ నేర చరిత్ర..

నల్లగొండ పట్టణంలోని ప్యారసభాగ్ కాలనీకి చెందిన అబ్దుల్ బారీకి భయంకరమైన నేర చరిత్ర ఉంది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా సంచలన హత్య కేసులోనూ ఇతడు నిందితుడిగా ఉండి జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత మిర్యాలగూడలో పట్టపగలు జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో ఏ4 నిందితుడిగా చేర్చబడ్డాడు. అమృత తండ్రి మారుతీరావుతో కలిసి హత్యకు పథకరచన చేయడంలో, సుపారీ ముఠాను సమకూర్చడంలో బారీ ప్రధాన పాత్ర పోషించినట్లు దర్యాప్తులో రుజువైంది.

కోర్టు విచారణ అనంతరం ప్రణయ్ హత్య కేసులో అబ్దుల్ బారీకి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి అతడు చర్లపల్లి సెంట్రల్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన బారీ జైలులోనే గుండెపోటుతో మరణించడంతో ఈ కేసు మరోసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

#Pranay Case#Miryalaguda Pranay Murder Case#Abdul Bari#A4 Accused#Pranay Murder#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి