తెలంగాణ

22A Lands: 22ఏ భూములపై రేవంత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

రచన: Mahesh3 నిమిషాల పఠనం

22A Lands: రాష్ట్రంలో గత నెల రోజులుగా తీవ్ర గందరగోళానికి దారితీసిన 22ఏ నిషేధిత భూముల వివాదానికి రేవంత్ రెడ్డి సర్కార్ చెక్ పెట్టింది. ప్రజలు, ఆస్తి యజమానుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.

22A Lands: రాష్ట్రంలో గత నెల రోజులుగా తీవ్ర గందరగోళానికి దారితీసిన 22ఏ నిషేధిత భూముల వివాదానికి రేవంత్ రెడ్డి సర్కార్ చెక్ పెట్టింది. ప్రజలు, ఆస్తి యజమానుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 22ఏ నిషేధిత పరిధిలో ఉన్నప్పటికీ.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి ప్రభుత్వ విభాగాల అనుమతులు ఉన్న భూములు, ప్లాట్లు, నివాస గృహాలకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.50 లక్షల ఎకరాల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే అధికారుల తప్పిదం వల్ల ప్రభుత్వ భూములతో పాటు సరైన లేఅవుట్ అనుమతులు ఉన్న ప్రైవేట్ స్థలాలు, ఓపెన్ ప్లాట్లు, నివాస గృహాలు కూడా ఈ జాబితాలోకి చేరడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అమ్మకాలు, కొనుగోళ్లను ఆపేసింది.

ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ వంటి ప్రాంతాల్లోని నివాస గృహాలు పెద్ద సంఖ్యలో నిషేధిత జాబితాలో చేరడంతో సామాన్య ప్రజలు, రియల్ ఎస్టేట్ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. విపక్షాలు, బాధితుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులతో చర్చించిన రేవంత్ ప్రభుత్వం.. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతులు ఉన్న ఏ నిర్మాణాన్ని కూడా అడ్డుకోరాదని తేల్చిచెప్పింది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో నెల రోజులుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయి సతమతమవుతున్న లక్షలాది మందికి భారీ ఉపశమనం లభించినట్లు అయ్యింది.

#22A Lands#22A Prohibited Lands#Telangana Government#Revanth Reddy Government#swechaaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి