వ్యాపారం

విద్యార్థులకు ‘ఎయిర్ ఇండియా’ గుడ్ న్యూస్.. టిక్కెట్ల బుకింగ్‌కు బంపర్ ఆఫర్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ దేశవ్యాప్తంగా చదువుకుంటున్న విద్యార్థులకు శుభవార్త అందించింది. కాలేజీ సెమిస్టర్లు, ఇంటర్న్‌షిప్‌లు, రాబోయే పండుగల సీజన్‌లో స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థుల ప్రయాణ భారాన్ని తగ్గించే లక్ష్యంతో 'స్టూడెంట్ ఫేర్' పేరుతో ప్రత్యేక రాయితీ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ దేశవ్యాప్తంగా చదువుకుంటున్న విద్యార్థులకు శుభవార్త అందించింది. కాలేజీ సెమిస్టర్లు, ఇంటర్న్‌షిప్‌లు, రాబోయే పండుగల సీజన్‌లో స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థుల ప్రయాణ భారాన్ని తగ్గించే లక్ష్యంతో 'స్టూడెంట్ ఫేర్' పేరుతో ప్రత్యేక రాయితీ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకునే విద్యార్థులకు విమాన ప్రాథమిక ఛార్జీ (బేస్ ఫేర్) పై 10 శాతం తక్షణ తగ్గింపు లభించనుంది.

 డిస్కౌంట్‌తో పాటు విద్యార్థులకు లగేజీ విషయంలోనూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ భారీ ఉపశమనం కల్పించింది. సాధారణంగా అనుమతించే 15 కేజీల లగేజీకి అదనంగా మరొక 10 కేజీలు, అంటే మొత్తం 25 కేజీల చెక్-ఇన్ బ్యాగేజీని ఉచితంగా తీసుకెళ్లే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఈ ప్రత్యేక రాయితీ ప్రయోజనాలను పొందడానికి అక్టోబర్ 20 వరకు తమ విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

 అదనంగా, సంస్థ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసుకుంటే ప్రయాణ తేదీల మార్పు రుసుమును కేవలం రూ.99గా నిర్ణయించారు. దీనికి తోడు 'VIBES' అనే ప్రోమో కోడ్ ఉపయోగిస్తే అదనంగా 5 శాతం తగ్గింపు, మరియు 'VISAFLY' కోడ్ ద్వారా అక్టోబర్ 9 వరకు గరిష్ఠంగా రూ.600 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చని వెల్లడించారు.

 ఈ ఆఫర్ ప్రయోజనాలు పొందడానికి ప్రయాణిస్తున్న విద్యార్థుల వయసు 12ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. బుకింగ్ సమయంలోనే 'స్టూడెంట్ ఫేర్' కేటగిరీని ఎంచుకోవాల్సి ఉంటుంది. విమానాశ్రయంలో చెక్-ఇన్ చేసే సమయంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన ఫొటో, పుట్టిన తేదీ కలిగిన ఒరిజినల్ ఐడీ కార్డును తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేశారు.

#AirIndiaExpress#StudentFareOffer#AirIndiaOffers#StudentDiscountFlight#TravelNews#FestivalOffers#IndianAviation
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి