ఏపీ

Zoom: జూమ్ మీటింగ్‌లో గణేషుడి లడ్డూ వేలం..! రూ.25లక్షలకు గెలుచుకున్న వ్యాపారి

రచన: NK2 నిమిషాల పఠనం

Zoom: మచిలీపట్నంలో గణేశుడి లడ్డూ వేలం పాట చాలా వినూత్నంగా జరిగింది. ఇంతవరకు ఎక్కడా జరగని విధంగా, ఎవరూ ఊహించని రీతిలో అక్కడ లడ్డూ వేలం వేశారు. మచిలీపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూమ్ ద్వారా వేలం పాట నిర్వహించారు.

Zoom: మచిలీపట్నంలో గణేశుడి లడ్డూ వేలం పాట చాలా వినూత్నంగా జరిగింది. ఇంతవరకు ఎక్కడా జరగని విధంగా, ఎవరూ ఊహించని రీతిలో అక్కడ లడ్డూ వేలం వేశారు. మచిలీపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూమ్ ద్వారా వేలం పాట నిర్వహించారు. 630 కిలోల గణేష్ లడ్డూ వేలం వేశారు. తుది బిడ్‌లో లడ్డూ 25 లక్షల రూపాయలు పలికింది. FCS ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి గుమ్మడి భవానీ శంకర్ బిడ్‌ను దాఖలు చేశారు. 63వేల రూపాయలతో ఈ వేలం పాట ప్రారంభమైంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా సుమారు 600 మంది భక్తులు వేలం పాటలో పాల్గొన్నారు. వ్యాపారి శంకర్‌ గణేశ్ లడ్డూను దక్కించుకున్నారు. ఆయనను కమిటీ సభ్యులు అభినందించారు.

#Zoom#Laddu Auction#Ganesh Laddu Auctions#Machilipatnam#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి