దునియా

CJP: 48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయకుంటే జంతర్‌ మంతర్‌ 2.0 : అభిజీత్ దీప్కే

రచన: Mahesh4 నిమిషాల పఠనం

CJP: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా దుమారం చెలరేగింది. 'సర్‌' పేరిట సాగుతున్న పరిణామాలపై ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ముప్పుగా మారారని ధ్వజమెత్తిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, ఆయన పదవి నుంచి వైదొలగడానికి 48 గంటల డెడ్‌లైన్ విధించారు.

CJP: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా దుమారం చెలరేగింది. 'సర్‌' పేరిట సాగుతున్న పరిణామాలపై ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ముప్పుగా మారారని ధ్వజమెత్తిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, ఆయన పదవి నుంచి వైదొలగడానికి 48 గంటల డెడ్‌లైన్ విధించారు. ఈ గడువులోగా సీఈసీ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తిస్తామని, ఢిల్లీ నడిబొడ్డున ‘జంతర్‌ మంతర్‌ 2.0’ ప్రజా సంగ్రామాన్ని చేపట్టి తీరుతామని సంచలన హెచ్చరిక చేశారు.

ఓటు హక్కును కాలరాయడానికి ఆయనెవరు?

ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభిజీత్‌ దీప్కే కేంద్ర ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటర్లే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, కానీ ప్రస్తుత సీఈసీ నేతృత్వంలో ఎవరు ఓటు వేయాలో ప్రభుత్వమే నిర్ణయించేలా దారుణమైన పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. ‘‘ప్రజాస్వామ్యానికి ప్రధాన ఎన్నికల కమిషనరే పెద్ద అవరోధంగా మారారు. పౌరుల ప్రాథమిక ఓటు హక్కును తొలగించడానికి ఆయనకు అధికారం ఎవరిచ్చారు? ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేదని భావిస్తే ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికలను బహిష్కరించాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. జ్ఞానేశ్‌ కుమార్ తప్పుకునేంత వరకు తమ ఉద్యమం విశ్రమించదని స్పష్టం చేశారు.

ఈసీ ముందు సీజేపీ మూడు కీలక డిమాండ్లు

సీజేపీ కో-కన్వీనర్‌ సౌరవ్‌ దాస్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడటానికి మూడు కీలక డిమాండ్లను తెరపైకి తెచ్చారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే రాజీనామా చేయడంతో పాటు ఆయనపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలి. వివాదాస్పద 'సర్‌' ప్రక్రియను పూర్తిగా నిలిపివేసి, 2025 ఓటర్ల జాబితానే ప్రామాణికంగా పరిగణించాలి. ఓటర్ల సవరణకు సంబంధించిన అన్ని ఫైళ్లను, రికార్డులను సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని స్వతంత్ర కమిటీ నియంత్రణలో ఉంచాలి. అలాగే ఈ వివాదం తేలేవరకు త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీజేపీ ఇచ్చిన ఈ 48 గంటల అల్టిమేటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

#CJP#Cockroach Janata Party#Abhijeet Deepke#Gyanesh Kumar#Chief Election Commissioner#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి