తెలంగాణ

Election Commission: ఎన్నికల కమిషన్ గూటిలో కుట్రల మంటలు..

రచన: Mahesh5 నిమిషాల పఠనం

Election Commission: భారత ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ఎన్నికల వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందా? ఓటర్ల డేటాబేస్, ఓట్ల నమోదుల వెనుక వ్యవస్థాగతంగా భారీ రిగ్గింగ్ జరుగుతోందా? ఈ సంచలన ప్రశ్నలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Election Commission: భారత ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ఎన్నికల వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందా? ఓటర్ల డేటాబేస్, ఓట్ల నమోదుల వెనుక వ్యవస్థాగతంగా భారీ రిగ్గింగ్ జరుగుతోందా? ఈ సంచలన ప్రశ్నలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘంపై విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలు సాధారణ ఆరోపణల స్థాయిని దాటి, నేరుగా రాజ్యాంగ వ్యవస్థల ఉనికే ప్రమాదంలో పడిందన్న ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.

ప్రజాస్వామ్యంపై దారుణమైన దాడి

"నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థమెక్కడుంది?" అంటూ విపక్ష నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఏదైనా ఒక రూపంలో అక్రమాలు జరుగుతుంటే, దానికి ఎన్నికల కమిషన్ సహకరిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికంటే తీవ్రమైన విషయం ఏమిటంటే — సాక్షాత్తు ఎన్నికల కమిషనర్‌కే ఈ అక్రమాలు, అవకతవకల గురించి తెలిసీ కూడా, వాటిని అడ్డుకోకుండా కళ్లప్పగించి చూస్తూ చోద్యం చూస్తుంటే... అది కేవలం పదవీ వైఫల్యం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. అంతకుమించి అది ముమ్మాటికీ 'దేశానికి తీరని ద్రోహం.. క్షమించరాని దేశద్రోహం' అని విపక్షాలు వేదికలపై గర్హిస్తున్నాయి.

డేటాబేస్ మార్పులు.. విమర్శలు

ఓటర్ల జాబితాలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అధికారిక డేటాబేస్‌ల నిర్వహణలో చోటుచేసుకుంటున్న మార్పులపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రంలోని అధికార వ్యవస్థలకు, ఎన్నికల అధికారులకు మధ్య జరుగుతున్న లావాదేవీలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేస్తున్నాయన్న వాదనలు ప్రస్తుతం జోరందుకున్నాయి.

ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, ఓటర్ల నమోదు ప్రక్రియలోనే అసలైన గోల్‌మాల్ జరుగుతోందని ప్రతిపక్ష నాయకులు విమర్శకులతో దుయ్యబడుతున్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కమిషన్ యంత్రాంగం పాలకుల కనుసన్నల్లో పనిచేస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

పాలకుల ఒత్తిళ్లతో ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయని తేలితే, ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

చిక్కుముడిలో ప్రతిపక్షాల వ్యూహం..

అయితే ప్రతిపక్షాల ఆరోపణలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. విపక్షాలు పదే పదే ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై 'నిరంకుశత్వ' ముద్ర వేస్తూ ఒక విచిత్రమైన ఉచ్చులో చిక్కుకుంటున్నాయని అధికార పక్షం కౌంటర్ ఇస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే, దాన్ని తప్పుపడుతూ వ్యవస్థలను కించపరచడమేంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

కానీ, దేశంలో ప్రతి ఓటరు ఓటు హక్కు సురక్షితంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుంది. ఆ నమ్మకాన్ని కాపాడాల్సిన రాజ్యాంగ సంస్థలే దారితప్పితే అంతిమంగా ప్రజాతీర్పుకే విలువ లేకుండా పోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దేశంలో ఎన్నికల వ్యవస్థ ప్రతిష్టను మసకబారుస్తున్న ఈ పరిణామాలు, 'దేశద్రోహం' అన్న స్థాయికి చేరిన ఈ విమర్శలు రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ తుఫానుకు దారితీస్తాయో చూడాలి.

#Election Commission#Election Commission of India#ECI#Indian Elections#Electoral System#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి