తెలంగాణ

TG : గణేశ్ నిమజ్జనం.. మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్

రచన: Kumar4 నిమిషాల పఠనం

వినాయకచవితి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. గణపయ్యను ప్రతిష్టించిన మూడో రోజు నుంచే హైదరాబాద్ మహానగరంలో ఘనంగా నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల నిమజ్జనాలు పూర్తయ్యాయి..

వినాయకచవితి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. గణపయ్యను ప్రతిష్టించిన మూడో రోజు నుంచే హైదరాబాద్ మహానగరంలో ఘనంగా నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల నిమజ్జనాలు పూర్తయ్యాయి.. రేపు నగరంలోని ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం జరగనుంది. రేపు ఉదయం శోభాయాత్ర అనంతరం మధ్యాహ్నం వరకు నిమజ్జనం ప్రక్రియ పూర్తి కానుంది.

ఇదిలాఉండగా, నగర వాసులకు హైదరాబాద్ మెట్రో అధికారులు తీపి కబురు అందించారు. శోభాయాత్ర, నిమజ్జనం మహోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. నగరంలోని అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.

హైదరాబాద్ నలుమూలల నుంచి వినాయకుల నిమజ్జనోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్‌, పార్కింగ్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున.. వాటిని అధిగమించేందుకు ప్రజలు, భక్తులు వీలైనంత వరకు మెట్రో రైలు ప్రయాణాన్నే వినియోగించుకోవాలని మెట్రో నిర్వాహకులు సూచించారు. ప్రస్తుతం రెడ్, బ్లూ, గ్రీన్ లైన్ల ద్వారా మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ లైన్ల ద్వారా సిటీలోని మేజర్ ప్రాంతాలను కవర్ చేయచ్చు.ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు మెట్రో సర్వీసులు ఉపయోగపడనున్నాయి.

మరోవైపు ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 5 గంటలకు రీ వెల్డింగ్ పనులు పూర్తి కానున్నట్టు సమాచారం. ముందుగా బడా గణపతికి ఉదయం 6 గంటలకు పూజ చేశాక.. నిర్వాహకులు శోభాయాత్ర ప్రారంభించనున్నారు.మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 మధ్య హుస్సేన్ సాగర్ నిమజ్జనం పాయింట్ వద్దకు బడా గణేశ్ చేరుకోనున్నాడు. 1:30 గంటల ప్రాంతంలో ముందస్తుగా ఏర్పాటు భారీ క్రేన్ సాయంతో నిమజ్జనం పూర్తికానుంది. కాగా, నిమజ్జనాల సందర్భంగా రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. రూట్ మ్యాప్ కూడా విడుదల చేశారు.

#kairathabad ganesh#imersion#metro timings#extended#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి