రక్షణ కల్పించాల్సిన పోలీసులే బక్షించారు. బయట ఎవరినీ నమ్మడానికి లేదు తనకు రక్షణ కల్పించాలని ఓ యువతి పోలీసులను సాయం కోరగా.. వారే ఆమె మీద మృగాళ్లలా విరుచుకపడ్డారు.మద్యం మత్తులో ఆమె మీద లైంగికదాడికి పాల్పడ్డారు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పోలీసులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆమ్రోహా జిల్లా హసన్‌పూర్‌లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. హర్యానాలోని ఫతేహాబాద్‌కు చెందిన 23 ఏళ్ల యువతి మతపరమైన ప్రదేశాల్ని సందర్శించాలనుంది.ఆ సమయంలోనే సాయం కోసం ఎదురుచూడగా.. అప్పుడు ఓ మహిళ ఆమెకు ఫోన్ చేసి CRPFలో ఇన్‌స్పెక్టర్ అయిన మోహిత్‌తో కలిసి వెళ్లమని సూచించింది.సెప్టెంబర్ 21న సోనిపట్‌లో మోహిత్‌ను కలిసిన యువతి.. అతనితో కలిసి మీరట్‌కు ప్రయాణించింది.
అక్కడ వారితో CRPF హెడ్ కానిస్టేబుల్ లాలారామ్ యాదవ్ జత కలిశాడు. సెప్టెంబర్ 22న వాళ్లు హసన్‌పూర్‌కి రాగా అక్కడ ఎస్సై సంజయ్ తోమర్, హెడ్ కానిస్టేబుల్ ప్రమోద్ జతకలిశారు. ఆ నలుగురు కలిసి యువతిని అత్రాసి-హసన్‌పూర్ రోడ్డుపై ఉన్న ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు.మద్యం సేవించిన అనంతరం మత్తులో యువతిపై మోహిత్, లాలారామ్, సంజయ్ గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డారు. ప్రమోద్ కూడా అత్యాచారానికి ప్రయత్నించగా.. అతడ్ని గదిలో నుంచి బయటకు నెట్టి లోపలి నుంచి గడియ పెట్టుకుంది బాధితురాలు..
అనంతరం గూగుల్ ద్వారా అమ్రోహా పోలీసుల నంబర్‌ను కనుగొని ఉదయం 6 గంటలకు వారికి ఫిర్యాదు చేసింది. వెంటనే హసన్‌పూర్, రజాబ్‌పూర్ పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని నలుగురు సీఆర్‌పీఎఫ్ పోలీసులను అరెస్ట్ చేసి వారి చెర నుంచి యువతిని రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, నలుగురిని అరెస్టు చేసి జైలుకు పంపామని పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.









