తెలంగాణ

బీఆర్‌ఎస్ నేతల భూఅక్రమాలపై విచారణకు హైపవర్ కమిటీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

తెలంగాణలోని పలు జిల్లాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, కొనుగోళ్లు, తీవ్ర అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకు చెందిన భూములపై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారికంగా జీవోను జారీ చేసింది.

 ఈ కమిటీకి ఐఏఎస్ అధికారిణి ఏ.శ్రీదేవసేన అధ్యక్షత వహించనుండగా, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు(IAS) కన్వీనర్‌గా, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(IAS) సభ్యుడిగా వ్యవహరిస్తారు. సెప్టెంబర్ 16న శాసనసభలో రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఏపై జరిగిన చర్చ ఆధారంగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చట్టాలు, నిబంధనలు, జీవోల ఉల్లంఘనలు జరిగాయా? అనే అంశాన్ని తేల్చి, బాధ్యులపై చర్యలను సిఫారసు చేయడం, అవసరమైతే మధ్యంతర నివేదికలను ప్రభుత్వానికి అందజేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా నిర్ణయించారు.

 ప్రభుత్వం విడుదల చేసిన అనుబంధ జాబితాలో రంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన మొత్తం 16 కీలక భూ అంశాలను చేర్చారు. ఇందులో ఎర్రవల్లిలోని కేసీఆర్ భూములు, రంగనాయకసాగర్ సమీపంలో హరీశ్‌రావు భూములు, మల్లన్నసాగర్ భూసేకరణ, జన్వాడలో కేటీఆర్ అనుచరుల కొనుగోళ్లు, షాద్‌నగర్‌లో గంగుల కమలాకర్, గండిపేటలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సంబంధించిన భూదాన్ భూముల కొనుగోలు ఆరోపణలు విచారణ పరిధిలోకి వస్తాయి.

 అదేవిధంగా మిడ్ మానేరు భూసేకరణ పరిహారం, ధరణి మాడ్యూల్ దుర్వినియోగంపై కూడా కమిటీ దృష్టి సారించనుంది. కమిటీ విచారణకు అవసరమైన రికార్డులు, సమాచారాన్ని సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలు, కలెక్టర్లు, స్థానిక సంస్థలను ఆదేశించారు. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ఉల్లంఘనలను తేల్చేందుకు కమిటీకి పూర్తి అధికారాలు కల్పించారు. అయితే, జాబితాలో చేర్చిన అంశాలు కేవలం ఆరోపణలు, విచారణ పరిధికి సంబంధించినవి మాత్రమేనని, కమిటీ తుది నివేదిక సమర్పించే వరకు వీటిని నిరూపితమైన అక్రమాలుగా పరిగణించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

#BRSLandScam#TelanganaGovt#GO134#KCR#KTR#HarishRao#TelanganaPolitics#SridevasenaIAS
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి