National

దేశాభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకం.. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా తన 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని చేపట్టిన 'సేవా సంకల్ప యాత్ర', 'సేవా సంకల్ప అభియాన్' ప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముచ్చటించారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని సాకారం చేయడంలో నేటి యువతరమే అసలైన శిల్పులని కొనియాడారు.

 దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా తన 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని చేపట్టిన 'సేవా సంకల్ప యాత్ర', 'సేవా సంకల్ప అభియాన్' ప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముచ్చటించారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని సాకారం చేయడంలో నేటి యువతరమే అసలైన శిల్పులని కొనియాడారు. దేశం సాధించే అభివృద్ధి ఫలాలను భవిష్యత్తులో పూర్తిగా అందుకోబోయే అతిపెద్ద లబ్ధిదారులు కూడా నేటి యువతేనని గుర్తుచేశారు.

 సేవా సంకల్పంతో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సామాన్యుల జీవితాలలో ఎలాంటి మార్పులు తెస్తున్నాయో ఈ యాత్ర ద్వారా యువత స్వయంగా తెలుసుకోవచ్చని అన్నారు. రాజకీయాలు, ఎన్నికల ప్రక్రియలు వాటి దారిన అవి సాగుతుంటాయని, కానీ దేశాభివృద్ధే తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని తెలిపారు. సమాజంలో సేవా గుణం పరిమళించినప్పుడే దేశంలోని కోట్లాది మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందంచగలమన్నారు.

 పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం 'ఆయుష్మాన్ భారత్' వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలు సాకారమవుతాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ మహత్తర బాధ్యతను యువత సమర్థవంతంగా నిర్వర్తించాలంటే దేశాన్ని క్షేత్రస్థాయి నుంచి లోతుగా అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని ప్రధాని సూచించారు. యువత వివిధ ప్రాంతాల్లో పర్యటించి, భిన్నవర్గాల ప్రజలతో మమేకమై వారి కలలు, ఆకాంక్షలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.

 దేశం యొక్క వాస్తవ పరిస్థితులను, క్షేత్రస్థాయి సవాళ్లను సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఈ 'సేవా సంకల్ప యాత్ర' యువతరానికి ఒక దిక్సూచిలా నిలుస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వారణాసి నుంచి వద్ నగర్ వరకు సాగుతున్న ఈ యాత్రలో వేలాది మంది యువత, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావడం అభినందనీయమని ప్రధాని అన్నారు. రాజకీయాలకు అతీతంగా సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, వృద్ధుల సేవను ఒక బాధ్యతగా స్వీకరించి ముందుకు సాగాలని యువశక్తికి దిశానిర్దేశం చేశారు.

#PMModi#SevaSankalpYatra#ViksitBharat2047#YouthPowerIndia#PMModiSpeech#AyushmanBharat#IndianPolitics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి