క్రైమ్

Crime : ఏటీఏంలో వాకీటాకీ.. మహిళకు మస్కా కొట్టి రూ.2.9 లక్షలు స్వాహా!

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఈజీ మనీ కోసం కొందరు అక్రమార్కులు అమాయకులను మోసం చేస్తున్నారు. వారి భయం, అభద్రతా భావాన్ని లక్ష్యంగా చేసుకుని రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. మహిళలు, వృద్ధులు ఎక్కువగా మోసాల బారిన పడుతుండగా.. ఇటీవలి కాలంలో చదువుకున్న వ్యక్తులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, పోలీసులు, డాక్టర్లు సైతం మోసపోతున్నారు.

ఈజీ మనీ కోసం కొందరు అక్రమార్కులు అమాయకులను మోసం చేస్తున్నారు. వారి భయం, అభద్రతా భావాన్ని లక్ష్యంగా చేసుకుని రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. మహిళలు, వృద్ధులు ఎక్కువగా మోసాల బారిన పడుతుండగా.. ఇటీవలి కాలంలో చదువుకున్న వ్యక్తులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, పోలీసులు, డాక్టర్లు సైతం మోసపోతున్నారు. తాజాగా ఓ మహిళను ఓ మాయగాడు బురిడీ కొట్టించాడు. ఏటీఎంలో వాకీటాకీ అమర్చి బాధితురాలిని భయాందోళనకు గురిచేశాడు. అనంతరం డబ్బులు కొట్టేశాడు.

వివరాల్లోకివెళితే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బోయిసర్ పట్టణానికి చెందిన ఓ మహిళ డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం వెళ్లింది. అక్కడ రూ.27 వేలు విత్‌డ్రా చేసింది. డెబిట్ కార్డు యంత్రంలోనే ఇరుక్కుపోగా ఎంత తీసినా బయటకు రాలేదు. ఈ క్రమంలోనే ఏటీఎంలో అమర్చిన వాకీ-టాకీతో సదరు మహిళను బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు.

సెక్యూరిటీ కెమెరా మిమ్మల్ని గమనిస్తోందని, కార్డుని బలవంతంగా తీయొద్దని ఆమెకి స్వరం వినిపించేలా మాట్లాడాడు. క్యాన్సిల్, ఎంటర్ బటన్లు నొక్కుతూ 3 సార్లు కార్డ్ పిన్ ఎంటర్ చేయాలని భయానక స్వరంతో సూచించాడు. బెదిరిపోయిన సదరు మహిళ అలాగే చేసింది. అయినప్పటికీ డెబిట్ కార్డు బయటకు రాకపోవడంతో మరుసటి రోజు టెక్నీషియన్ వచ్చి కార్డు తీసి ఇస్తాడని నమ్మబలికాడు.

దాంతో ఆమె ఏటీఎం సెంటర్ నుంచి వెళ్లిపోగా కాసేపటికే రూ.2.9 లక్షలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. మోసపోయానని భావించిన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడు రామ్‌దేవ్ పాల్‌గా గుర్తించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.2.6 లక్షల నగదు, వాకీ-టాకీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయం బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#Atm#cheating#women#maharastra#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి