తెలంగాణ

TG : ‘దానం’కు సుప్రీం షాక్.. రేవంత్ ఇకనైనా బుద్ది తెచ్చుకో : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం సైతం రాష్ట్ర హైకోర్టు తీర్పును సమర్థించింది.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం సైతం రాష్ట్ర హైకోర్టు తీర్పును సమర్థించింది. స్టే ఇవ్వలేమని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది.అయితే, దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు కావడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించడం రాజ్యాంగ విజయమని పేర్కొన్నారు. బీజేఎల్పీ చేసిన న్యాయపోరాటం వల్లే ఈ విజయం దక్కిందని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై కోర్టుల్లో న్యాయపోరాటం క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని వెల్లడించారు.

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం కంచే చేను మేసిన వైనాన్ని తలపించిందని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగ ద్రోహానికి పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తోటి రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలని హితవు పలికారు.

అస్తమానం రాజ్యాంగ ప్రతిని పట్టుకొని తిరిగే లోక్‌సభ ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర పార్టీ ఎమ్మెల్యేకు తన పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఆయన చెప్పేది ఒకటి చేసేది మరొకటి అనడానికి ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు. ఇదిలాఉండగా, ఏలేటి మహేశ్వర్‌తో పాటు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం దానం నాగేందర్ శాసనసభ్యత్వం రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

#mla danam nagender#khairatabad#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి