తెలంగాణ

ట్యాంక్ బండ్‌పై కేసీఆర్ పాట.. గణేష్ భక్తులపై ఎస్సై లాఠీఛార్జ్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ట్యాంక్ బండ్ పరిసరాల్లో గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిమజ్జనానికి వచ్చిన ఒక డీడిజే వాహనంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన పాటలు ప్లే చేశారు. ఈ కారణంగా ఎస్ఐ నరేష్ అనే పోలీస్ అధికారి భక్తులపై లాఠీ ఝులిపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ట్యాంక్ బండ్ పరిసరాల్లో గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిమజ్జనానికి వచ్చిన ఒక డీజే వాహనంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన పాటలు ప్లే చేశారు. ఈ కారణంగా ఎస్ఐ నరేష్ అనే పోలీస్ అధికారి భక్తులపై లాఠీ ఝులిపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనంలో కేసీఆర్ పాటలు పెట్టకూడదని హెచ్చరిస్తూ, మాట వినకపోతే తీవ్రమైన కేసులు నమోదు చేస్తానని భక్తులను భయభ్రాంతులకు గురిచేయడం తీవ్ర కలకలానికి దారితీసింది.

 ఈ ఘటనలో సదరు ఎస్ఐ వాహనం నిర్వాహకుడిని డీజే వాహనం పైనుంచి కిందకు లాగి వేధించాడని బాధితులు ఆరోపించారు. కేసీఆర్ పాటలు ప్లే చేస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా వాహనాన్ని కూడా సీజ్ చేస్తానని తీవ్రంగా బెదిరించాడని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. గణేష్ నిమజ్జన వేడుకల్లో భాగంగా ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ ఊరేగింపుగా వెళ్తుండగా, పోలీస్ అధికారి ఈ రకంగా లాఠీలతో కొట్టడం, దుర్భాషలాడడంపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

 అంతేకాకుండా, ఈ సమాచారాన్ని కవర్ చేసేందుకు ఘటనా స్థలానికి వెళ్లిన ఓ రిపోర్టర్‌పై కూడా ఎస్ఐ నరేష్ దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. తన వాహనం, దాడి దృశ్యాలను వీడియోలు తీస్తున్న రిపోర్టర్ షర్ట్ గల్లా పట్టుకుని, ‘వీడియోలు ఎందుకు తీస్తున్నావు?’ అంటూ బెదిరించడంతో మీడియా వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విధులు నిర్వహించే జర్నలిస్టుపై పోలీస్ అధికారి చేయి చేసుకోవడానికి యత్నించడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

 పండగ వాతావరణంలో భక్తులపై, మీడియా ప్రతినిధులపై ఈ రీతిలో లాఠీఛార్జ్ చేయడం, బెదిరింపులకు పాల్పడడంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యుడైన ఎస్ఐ నరేష్‌పై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

#GaneshVisarjan2026#TankBundGanesh#HyderabadPolice#SI_Naresh#KCRSongsControversy#HyderabadNews#TelanganaNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి