సినిమా

Prabhas: స్పిరిట్ ప్రభాస్ కెరీర్‌లో చాలా ప్రత్యేకం..ఎందుకంటే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటుస్తున్న లేటెస్ట్ సినిమా ‘స్పిరిట్’. ఇప్పటికే, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో, ప్రభాస్ వైల్డ్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. హెవీ యాక్షన్ డ్రామాగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక, తాజా సంచారం మేరకు స్పిరిట్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేశాడట.

త్వరలోనే ఈ సాంగ్ షూట్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈ సాంగ్ లో ప్రభాస్ ను చాలా కొత్తగా..స్టైలిష్ లుక్‌ లో సందీప్ చూపిస్తారని, ఇప్పటికే లుక్ కూడా లాక్ చేశారని తెలుస్తోంది. ఇక, ఈ సాంగ్ లో ఒక స్టార్ హీరోయిన్ ని ఫైనల్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే, ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా రివీల్ కాలేదు. వాస్తవానికి, స్పిరిట్ సినిమాలో దీపిక పడుకొణె నటించాల్సి ఉండగా..పలు కారణాల వల్ల తన స్థానంలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు.

ఇక, ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టి-సిరీస్ తో కలిసి భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్నమైన సినిమా రాబోతుందని ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్టర్ వదిలినప్పటి నుంచీ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.

ప్రభాస్ కెరీర్‌లో స్పిరిట్ మైల్ స్టోన్ మూవీ:

ప్రభాస్ కెరీర్‌లో మొదటిసారి ఓ వైల్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. అంతేకాదు, ఈ సినిమా కోసం మేకోవర్ చాలా కొత్తగా ప్లాన్ చేశారు. ఇప్పటి వరకూ ఉన్న ఇమేజ్‌ను పూర్తిగా మార్చేందుకు సందీప్ రెడ్డి వంగా ఎంతో కసితో స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఒకేసారి, రెండు విభిన్నమైన కథల్లో నటిస్తుండగా..స్పిరిట్ సినిమా ఖచ్చితంగా ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి సిరీస్ తర్వాత అలాంటి మైల్ స్టోన్ గా నిలవనుందని నమ్మకంగా ఉన్నారు.

#Prabhas#Spirit#Sandeep Reddy Vanga#Tripti Dimri
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి