Kayadu Lohar: యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇమ్మోర్టల్’. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇక ఇప్పుడు తెలుగు వెర్షన్‌లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ, కూడా ఇమ్మోర్టల్ యావరేజ్ టాక్ నే తెచ్చుకుంది. హర్రర్ జానర్‌లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఇమ్మోర్టల్ కి ప్రధాన బలం హీరోయిన్ కయాదు లోహర్. ఆమె పాత్ర, కథలో ప్రాధాన్యత సినిమాకి హైలెట్‌గా నిలిచాయి.
కయాదు లోహర్ అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులలో ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. సౌత్ లో ఇప్పుడున్న యంగ్ బ్యూటీస్‌లో కయాదు వరుసగా ఆఫర్స్ అందుకుంటోంది. అయితే ఒక హీరోయిన్ గా తన మార్కెట్‌ను ఇంకా పెంచుకోవాలంటే వరుసగా గుర్తుండిపోయే సినిమాలు, వాటితో వచ్చే సక్సెస్ చాలా ముఖ్యం. ఈ క్రమంలో వచ్చిన ‘ఇమ్మోర్టల్’ కయాదు కెరీర్‌లో మరో మంచి సినిమాగా చెప్పుకోవచ్చు.
‘ఇమ్మోర్టల్’ చిత్రాన్ని కేవలం బాక్సాఫీస్ లెక్కలతో మాత్రమే చూడలేము. ఒక సినిమా ద్వారా ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ కి వచ్చే విజిబిలిటీ, కొత్త ఆఫర్లు, ప్రేక్షకుల్లో పెరిగే గుర్తింపు కూడా కెరీర్ పరంగా కీలకమే అని చెప్పాలి. అయితే, కయాదు లోహర్ విషయంలో కూడా ‘ఇమ్మోర్టల్’ అటువంటి సినిమాగా నిలిచే అవకాశం ఉంది. సినిమాలో ఆమె పాత్రకు వస్తోన్న స్పందన, సోషల్ మీడియాలో కామెంట్స్, ప్రేక్షకుల నుంచి వచ్చే గుర్తింపు—ఇవన్నీ రానున్న సినిమాలపై ప్రభావం చూపుతాయనడంలో సందేహమే లేదు. అంతగా ఇమ్మోర్టల్‌లో సింధు పాత్ర ద్వారా ఆకట్టుకుంది.
ఇటీవల వచ్చిన సినిమాలన్నీ కయాదుకి ఆశించిన విజయాలను అందివ్వలేకపోతున్నాయి. చలాకీతనం, అందం, అభినయం ఉన్నా కూడా సరైన కథలను ఎంపిక చేసుకోకపోతే, ఇప్పుడు పోటీలో తట్టుకొని నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. కానీ, ఇక్కడ కయాదు మంచి అవకాశాలనే అందుకుంటోంది. కానీ, తనకి సక్సెస్ మాత్రం దక్కడం లేదు. హిట్స్ లేకపోతే, హీరోయిన్స్‌ని త్వరగా పక్కన పెట్టేస్తారు. మరి, కయాదు ఆ లిస్ట్ లో చేరకూడదంటే ఇకపై సక్సెస్ ఇచ్చే కథలను ఎంచుకోవాలి.












