Keerthy Suresh: మన సౌత్ ప్రేక్షకులకు బాగా ఇష్టమైన హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. ‘మహానటి’ సినిమాతో గొప్ప నటిగా తన స్థాయిని మరో మెట్టు పైకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కీర్తికి కీర్తితో పాటు అవార్డులు, ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విభిన్న కథా చిత్రాలను చేస్తూ పాన్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలలో ఉంది.
అయితే కీర్తి సురేష్ కెరీర్ ని గనక మనం గమనిస్తే..చాలా మార్పులు చోటు చేసుకున్నట్టుగా అర్థమవుతోంది. ముఖ్యంగా, కథలు, దర్శకుల ఎంపికలో వైవిధ్యం కనిపిస్తోంది. కీర్తి కెరీర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాలనే ఎంచుకుంది. కానీ, ఆ తర్వాత మాత్రం కమర్షియల్ హీరోయిన్ అనే ఇమేజ్‌లో ఉండకుండా.. కథ, పాత్ర, దర్శకుడి విజన్‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంంటోంది.
ప్రస్తుతం కీర్తి ఎంపిక చేసుకున్న సినిమాలు:
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమాలో కీర్తి వెంకీకి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం 2027 సంక్రాంతి, ‘జనవరి 12 విడుదల’ విడుదలకు సిద్ధమవుతోంది.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ లో కూడా కీర్తి సురేష్ కనిపించబోతోంది. ఇది కూడా ఆమె కెరీర్‌లో ఆసక్తిని పెంచుతున్న మరో సినిమా. ఇందులో, కేవలం స్పెషల్ నంబర్‌లోనే అలరించబోతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండటంతో, ఈ సినిమా కీర్తి సురేష్‌కు కూడా తెలుగులో ప్రత్యేకించి స్పెషల్ నంబర్ పరంగా గుర్తింపు తెచ్చే అవకాశముంది.
కీర్తి సురేష్ నటించిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘సత్యవాన్ సావిత్రి’. ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వం వహించిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామాలో కీర్తి ఒక లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. మైస్కిన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
కథలో చట్టం, న్యాయం మధ్య ఉన్న వ్యత్యాసం ప్రధాన అంశంగా ఉండనుందని దర్శకుడు వెల్లడించారు. సావిత్రి అనే లాయర్ తన భర్తకు సంబంధించిన కేసులో పోరాడే మహిళ పాత్రలో కీర్తి నటిస్తోంది. అలాగే, మరో విభిన్నమైన కథతో తెరకెక్కుతోంది కాత్రీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న డోరతి. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఇది తెరకెక్కుతున్నట్టుగా సమాచారం. కీర్తి లైనప్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కానీ, హిట్స్ ఏమేరకి ఖాతాలో చేతతాయనేది ఇక్కడ ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే, ‘మహానటి’ తర్వాత మళ్ళీ సాలీడ్ హిట్ ఇప్పటి వరకూ కీర్తి అందుకోలేకపోయింది.










