Bollywood: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనె దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. వారి ఇంట్లోకి కొత్త అథితి వచ్చారు. ఈ జంటకి పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక, ఈ సందర్భంగా వారు..“వెల్కమ్ బేబీ గర్ల్, 19/9/2026” అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతోంది.
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనె 2018లో ఇరుకుటుంబ సభ్యులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన అత్యంత సన్నిహితులు, వ్యాపార వేత్తల సమక్షంలో ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ స్టార్ కపుల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. 2024లో మొదటి సంతానంగా పాప పుట్టింది. ఈ పాపకి 'దువా పదుకొనె' అని నామకరణం చేశారు. ఇప్పుడు, ఈ పాపకి చిట్టి చెల్లి వచ్చేసింది. సెప్టెంబర్ 19న రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనె లకి రెండవ కుమార్తె జన్మించింది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలకి చెందిన పలువురు సినీ తారలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే, అభిమానుల నుంచి కూడా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనె ఇంట పండుగ వాతావరణం నెలకొంది. మరి, ఈ జంట తమ రెండవ కుమార్తెకి ఏ పేరు పెడతారో.. అని అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
గర్భంతోనే 'రాకా' షూటింగ్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా రాకా. అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, దీపిక 'రాకా' మూవీలో గర్భం దాల్చిన పాత్రలో కొన్ని సన్నివేశాలలో కనిపించాల్సి ఉండగా..నిజమైన గర్భంతోనే ఆ సీన్స్‌ను పూర్తి చేసిందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక, ఆమె తాజాగా ఆడబిడ్డకి జన్మనివ్వడంతో రాకాలో నిజమైన గర్భంతోనే కనిపించబోతుందని క్లారిటీ వచ్చేసింది.











