పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ.. విభిన్న కథలతో వరుసగా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.. ఆయన చిత్రాలు భారీ బడ్జెట్‌లు, గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కుతూ.. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొలపుతూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ ఫౌజీ.. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుందని వెల్లడించారు.
రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ అవతారంలో కనిపిస్తూ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నారు.
భారీ సైన్యాన్ని ఒంటరిగా ఎదుర్కొన్న యోధుడిలా కనిపిస్తున్న ప్రభాస్ గెటప్.. ఆ పోస్టర్‌కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పోస్టర్ ఇలా ఉంటే.. సినిమా యాక్షన్ స్థాయి, విజువల్ గ్రాండియర్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అనే ఆసక్తిని అభిమానుల్లో కలిగించారు. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ కొనసాగుతున్న ఈ సినిమా అప్‌డేట్స్, రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారత స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన సంఘటనల నేపథ్యంలో రూపొందుతున్నదని తెలుస్తుంది. కాగాదర్శకుడు ఈ సినిమాను తన కెరీర్‌లోనే మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.












