వైరల్ న్యూస్

ఏం మనుషులు రా అయ్యా.. పాల ట్యాంకర్ బోల్తా.. ఎలా ఎగబడ్డారో చూడండి..

రచన: NK3 నిమిషాల పఠనం

పాల ట్యాంకర్ బోల్తా పడటంతో హైవేపై వేల లీటర్ల పాలు ఒలికిపోయాయి. ఒలికిన పాలను సేకరించడానికి స్థానికులు ఎగబడ్డారు.

Milk Tanker Overturned: బిహార్ రాష్ట్రం పాట్నాలో ఓ పాల ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడింది. అంతే.. ఆ తర్వాత అక్కడ జరిగిన తంతు చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. ఏం మనుషులు రా అయ్యా అని తల పట్టుకుంటున్నారు. పాల ట్యాంకర్ బోల్తా పడిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చేశారు. ట్యాంకర్ నుంచి పాలు లీక్ కావడంతో వాటి కోసం ఎగబడ్డారు. కొందరు బాటిల్స్ లో పాలు పట్టుకుంటే మరికొందరు ఏకంగా బకెట్లు వెంట తెచ్చుకుని మరీ పాలు పట్టుకెళ్లారు. వెంట తెచ్చుకున్న బాటిల్స్, బకెట్లు నిండిపోవడంతో కొందరు ఏకంగా ట్యాంకర్ దగ్గర నోరు పెట్టి మరీ పాలను తాగేశారు.

పాల ట్యాంకర్ బోల్తా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారు వచ్చే లోపే చాలా మంది బాటిల్స్, బకెట్లు నింపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ''పాల ట్యాంకర్ బోల్తా పడటంతో హైవేపై వేల లీటర్ల పాలు ఒలికిపోయాయి. ఒలికిన పాలను సేకరించడానికి స్థానికులు ఎగబడ్డారు. నిమిషాల వ్యవధిలోనే బకెట్లు, బాటిల్స్ ఇతర పాత్రలతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేశాము'' అని పోలీసులు వెల్లడించారు.

పాల ట్యాంకర్ బోల్తా పడటం, లీక్ అవుతున్న పాల కోసం జనాలు ఎగబడటం.. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికులు తీరు చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. పండ్లు, కూరగాయలు, చేపలతో వెళ్తున్న వాహనాలు బోల్తా పడగా.. వాటిని తీసుకెళ్లేందుకు జనాలు ఎగబడ్డారు. పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు బోల్తా పడ్డప్పుడు కూడా ఇలానే బకెట్లు వెంట తెచ్చుకుని మరీ తీసుకెళ్లారు జనాలు. ప్రమాదం జరిగాక గాయాలపాలైన వ్యక్తులను కాపాడాల్సింది పోయి.. దొరికిన వాటిని దోచుకెళ్లడం కామన్ గా మారిపోవటం బాధాకరం అంటున్నారు నెటిజన్లు.

#Milk Tanker Overturned#Bihar#Patna#Viral#Spilled Milk#Viral Video
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి