ఒడిశాలోని పూరీలో జరుగుతున్న ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోగా.. 120 మంది భక్తులకు గాయాలయ్యాయని సమాచారం. జగన్నాథ రథయాత్రలో భారీ జనసందోహం కారణంగా ఊపిరాడక, తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది.
కాగా గాయపడిన వారిని పోలీసులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కాగా నేడు (గురువారం) జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను భవ్యమైన రథయాత్రలో ఊరేగిస్తున్నారు. ఇక రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన క్రమంలో గుండిచా ఆలయం సమీపంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
మరోవైపు రథయాత్ర కోసం ప్రభుత్వం కూడా భారీగా ఏర్పాట్లు చేసింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది మోహరించారు. అయినా కూడా ఒకేచోట పెద్ద ఎత్తున జనం గుమిగూడడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించి పలువురిని రక్షించారు.












