ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నియోగదారుల కోసం వివో టీ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో టీ5 లైట్ పేరిట 5G ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అలాగే ఇండియాలో మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ధరలు కూడా సామాన్యుడి బడ్జెట్ లో వచ్చేలా ప్లాన్ చేసింది.
ఇక Vivo T5 Lite 5Gలో స్టోరేజ్ 4GB ర్యామ్, 128GB వేరియంట్ ధర రూ. 19,999తో లభిస్తోంది. అలాగే వేరియంట్ ను 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999తో అందుబాటులోకి తెచ్చింది. ఇక మూడవ వేరియంట్ 6GB ర్యామ్ + 256GB స్టోరేజ్‌తో ధర రూ.25,999తో మార్కెట్లోకి విడుదల చేసింది.
మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. Vivo T5 Lite 44W 5G స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్‌గా 6500mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ నిలుస్తోంది. సాధారణ వినియోగంలో ఈ బ్యాటరీ రెండు రోజులకుపైగా బ్యాకప్ అందించేలా రూపొందించామని కంపెనీ పేర్కొంది.
అంతేకాకుండా, బ్యాటరీని తక్కువ సమయంలోనే ఛార్జ్ చేసుకునేందుకు 44W ఫ్లాష్‌చార్జ్ సాంకేతికతను కూడా అందుబాటులో ఉంచింది. దీంతో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు వేగవంతమైన ఛార్జింగ్ పొందే అవకాశం ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 6.74-ఇంచుల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్‌తో పాటు 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐ ప్రొటక్షన్ కోసం ఈ డిస్‌ప్లేకు TUV Rheinland సర్టిఫికేషన్ కూడా అందుబాటులో ఉంది..
పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో అత్యంత పవర్‌ఫుల్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనిలో AI క్రియేషన్, AI క్యాప్షన్‌తో పాటు ప్రైవేట్ స్పేస్ వంటి చాలా ప్రత్యేకమైన AI ఫీచర్లు ఉన్నాయి.
ఫోటోల విషయానికి వస్తే.. Vivo కెమెరా పరంగా క్వాలిటీ గా ఉంది.. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాతో పాటు 0.8MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది.. ఇందులో చాలా ప్రత్యేమైన నైట్ మోడ్‌తో పాటు పోర్ట్రెయిట్ మోడ్ వంటి అడ్వాన్స్‌డ్ AI కెమెరా ఫీచర్లు సైతం అందుబాటులోకి తెచ్చింది. అలాగే ముందు భాగంలో 5MP కెమెరాను సెల్ఫీల కోసం అందించారు.
అలాగే ఈ 5G స్మార్ట్‌ఫోన్ కేవలం అధునాతన ఫీచర్లతోనే కాకుండా, క్వాలిటీ పరంగా కూడా హై ప్రొఫైల్ తో ప్రత్యేకంగా రూపొందించబడిందని కంపెనీ వెల్లడించింది. ఈ డివైస్‌కు SGS సర్టిఫికేషన్‌తో పాటు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ప్రమాణాలను కూడా అందించారు. ప్రొటక్షన్ కోసం IP65 రేటింగ్ అందించారు. మరింత భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయగా, కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.4, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇక రిటైల్ స్టోర్‌లలో జులై 22న అమ్మకానికి రానుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యాక్సిక్ బ్యాంక్ కార్డు హోల్డర్స్‌కు రూ.1500 డిస్కౌంట్‌తో పాటు.. మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది












