ఏపీ

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఈడీ!..

రచన: Venu4 నిమిషాల పఠనం

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కాం కేసు లో ఈడీ దూకుడు పెంచింది. ఈ స్కామ్ లో నిందితులుగా ఉన్న వారిని బషీర్ బాగ్ లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించింది.

భారతదేశం అభివృద్ధి చెందడానికి కావలసినన్ని వనరులున్నాయి.. కానీ నిజాయితీగల నాయకులు లేకపోవడం వల్లనే ఇండియాతో పాటు రాష్ట్రాలు.. ప్రజలు వెనుకబడి ఉన్నారనే వాదనలు ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి. ఇక్కడ జరిగినన్ని స్కామ్ లు బహుశా మరే దేశంలో జరిగి ఉండకపోవచ్చేనే టాక్ కూడా ఉంది.

అలాగే మనదేశంలోని చట్టాల్లో ఉన్న బలహీనతల వల్లే.. దోచుకున్న వాడికి దోచుకున్నంత.. అనే రీతిగా వ్యవస్థ తయారు అయ్యిందని అంటున్నారు. ఫలితంగా భారీ స్కామ్ లు బయటికి వస్తున్నాయి. ఇలాంటి ఉందతాల వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటం దురదృష్టకరం. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కాం కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు..

ఎన్నో కీలక మలుపులు తీసుకున్న లిక్కర్ స్కామ్ ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి రాలేదు. అయితే తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్, డైరెక్టరేట్ ఈ కేసు దర్యాప్తు ను మరింత వేగవంతం చేసింది. ఈ స్కామ్ లో నిందితులుగా ఉన్న ఏపీఎస్‌ బీసీ ఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు కుమారుడు సునీల్ కుమారులను హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలు నుండి బషీర్ బాగ్ లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి భారీ భద్రత నడుమ అధికారులు తరలించారు.

కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు ఈ ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ముందుగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. వీరిని మూడు రోజుల పాటు విచారించే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణల ఆధారంగా.. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కేటాయించడంతో ప్రభుత్వానికి సుమారు రూ.195 కోట్ల మేర నష్టం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు, అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

మూడు రోజుల కస్టడీలో టెండర్ల కేటాయింపు ప్రక్రియ, నిబంధనల మార్పులు, ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలు, అలాగే సంబంధిత అధికారుల పాత్రపై నిందితులను ఈడీ అధికారులు లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు అధికారులు, కీలక వ్యక్తుల నుంచి వాంగ్మూలాలు సేకరించగా.. కస్టడీ విచారణలో మరిన్ని ఆధారాలు సేకరించే అవకాశం ఉన్నట్టు ఈడీ భావిస్తుంది.

#ap#liquor scam#3-day-custody#three-accused#money-laundering
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి