ఏపీ

తల్లికి వందనం.. ప్రభుత్వం బిగ్ అప్‌డేట్.. ఆ రోజున ఖాతాల్లోకి డబ్బులు..

రచన: NK3 నిమిషాల పఠనం

ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లు, ఎయిడెడ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేయబడుతుంది. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నగదును నేరుగా జమ చేస్తుంది సర్కార్.

తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. నిధుల విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఈ నెల 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. మొత్తం 67 లక్షల 47వేల 190 మంది విద్యార్థులకు లబ్ది కలగనుందని తెలిపింది. 42 లక్షల 70వేల 802 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేయనున్నట్లు వివరించింది.

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. వాటిలో తల్లికి వందనం స్కీమ్ ఒకటి. విద్యార్థుల తల్లులకు ఆర్థిక చేయూతను అందించే లక్ష్యంతో ఈ స్కీమ్ తీసుకొచ్చింది.

ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లు, ఎయిడెడ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేయబడుతుంది. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నగదును నేరుగా జమ చేస్తుంది సర్కార్.

ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి మొత్తం 15 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది ప్రభుత్వం. ఇందులో 13 వేలు మాత్రమే జమ చేయబడుతుంది. మిగతా 2వేల రూపాయలు పాఠశాలల మౌలిక సదుపాయాల నిర్వహణ కోసం ప్రభుత్వం వినియోగించనుంది.

#Thalliki Vandanam#Andhra Pradesh#AP#Thalliki Vandanam Scheme#Cm Chandrababu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి