ఏపీ

Alur Mla Virupakshi: వైసీపీకి షాక్.. ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన పోలీసులు

రచన: NK4 నిమిషాల పఠనం

కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో సహా 15 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. విరూపాక్షిని చిప్పగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఆలూరు కోర్టుకు తరలించారు. ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే విరూపాక్షిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Alur Mla Virupakshi: కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో సహా 15 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. విరూపాక్షిని చిప్పగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఆలూరు కోర్టుకు తరలించారు. ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే విరూపాక్షిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక వివాదంలో నిన్న టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డినట్లు ఎమ్మెల్యే విరూపాక్షిపై ఆరోపణలు ఉన్నాయి. నిన్న రాత్రి సంగాల, నేమకళ్లలో వైసీపీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దాడులు చేశారని టీడీపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ తెల్లవారుజామునే ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తి స్థాయిలో ఆయనను విచారించారు. నిన్న రాత్రి చిప్పగిరి మండలం నేమకళ్లలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బీభత్సం సృష్టించారని.. తమ ఇళ్లపై దాడులు చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. విచక్షణారహితంగా తమపై దాడులు చేశారని, ఇళ్లలోకి దూరి సామాగ్రిని కూడా ధ్వంసం చేశారని వాపోయారు. ఈ దాడుల్లో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్వయంగా పాల్గొన్నట్లు వీడియోల్లో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించారు. ఈ తెల్లవారుజామున ఎమ్మెల్యేతో పాటు దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న 15మందిని అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ గురించి తెలియగానే వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. వెంటనే ఎమ్మెల్యేని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ దగ్గరున్న ఆధారాల మేరకు ఎమ్మెల్యేని, ఆయన అనుచరులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

#Mla Virupakshi#Alur#Kurnool#Arrest#Ysrcp#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి