క్రీడలు

Abhishek Sharma: 91 బంతుల్లో 233 పరుగులు.. 25 సిక్సర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత

రచన: NK3 నిమిషాల పఠనం

జస్ట్ 91 బంతుల్లో 233 పరుగులు.. అందులో 15 ఫోర్లు, 25 సిక్సర్లు.. ఇదీ టీడిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చేసిన విధ్వంసం. పంజాబ్ ఇంటర్-డిస్ట్రిక్ట్ సీనియర్ వన్డే టోర్నమెంటులో అభిభిషేక్ శర్మ సంచలన బ్యాటింగ్ చేశాడు. పరుగుల సునామీ సృష్టించాడు. 256 స్ట్రైక్ రేట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తార్న్ తారన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో అమృత్‌సర్ సీనియర్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అభిషేక్.

Abhishek Sharma: జస్ట్ 91 బంతుల్లో 233 పరుగులు.. అందులో 15 ఫోర్లు, 25 సిక్సర్లు.. ఇదీ టీడిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చేసిన విధ్వంసం. పంజాబ్ ఇంటర్-డిస్ట్రిక్ట్ సీనియర్ వన్డే టోర్నమెంటులో అభిభిషేక్ శర్మ సంచలన బ్యాటింగ్ చేశాడు. పరుగుల సునామీ సృష్టించాడు. 256 స్ట్రైక్ రేట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తార్న్ తారన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో అమృత్‌సర్ సీనియర్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అభిషేక్.

టీ20లలో నెంబర్ 3 ర్యాంకర్ గా ఉన్న అభిషేక్ శర్మ.. ఇటీవల జింబాబ్వే పర్యటనలో ఘోరంగా విఫలమయ్యాడు. మూడు ఇన్నింగ్స్ లో 11 పరుగులు (1,8,2) మాత్రమే చేశాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇంగ్లండ్ తో 5 మ్యాచుల టీ20 సిరీస్ లో 26.2 యావరేజ్ తో కేవలం 131 పరుగులే చేశాడు.

ఇక ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో 2 మ్యాచుల్లో 24.5 యావరేజ్ తో 49 పరుగులే చేశాడు. గత 10 టీ20 మ్యాచుల్లో కేవలం ఒక అర్థ శతకం మాత్రమే చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఘోరంగా విఫలమైన శర్మ.. లోకల్ మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోయాడు. బ్యాటింగ్ లో తన విశ్వరూపం చూపించాడు.

#Abhishek Sharma#Punjab Inter District Senior Match#Amritsar Senior Team#Tarn Taran#Cricket#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి