సినిమా

Tollywood Stars: నాని నిర్మాతగా నితిన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం.!

రచన: Anshu3 నిమిషాల పఠనం

Tollywood Stars: టాలీవుడ్ స్టార్స్ నాని, నితిన్ కలిసి ఓ సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నానీ ఒకవైపు హీరోగా ది ప్యారడైజ్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ఆగస్టు 6న రిలీజ్ కాబోతోంది. అందరూ, ఈ టీజర్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, నాని మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు.

నాని సొంత నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సోమవారం నితిన్ హీరోగా కొత్త సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు. నాని నిర్మాతగా తీసిన కోర్ట్ కి పలు నామినేషన్స్ వెళ్ళాయి. అలాగే, మెగాస్టార్ చిరంజీవితో కూడా నాని ఒక సినిమాను ప్రకటించాడు. ది ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ఈలోపే నాని, దండోరా ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వంలో నితిన్ హీరోగా సినిమాను నిర్మించబోతున్నాడు. ఇందులో, నితిన్ కి జంటగా కాంతార 1 ఫేమ్ రుక్మిణి వసంత్ నటించనుందని సమాచారం. ఇక, మరికొన్ని గంటల్లో నాని-నితిన్ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. గత కొంతకాలంగా నితిన్ సక్సెస్‌లు లేక కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. తమ్ముడు ఫ్లాప్ తర్వాత ఒక్కో సినిమాను ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు.

దిల్ రాజు బ్యానర్‌లో చెయ్యాల్సిన ఎల్లమ్మ సినిమా కూడా జారిపోయింది. ఆ తర్వాత సితార నాగవంశీ నిర్మాణంలో ఒక సినిమాను ఒప్పుకున్నాడు. రితిక నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, సొంత బ్యానర్‌లో అంజి దర్శకుడిగా ఇంకో సినిమాను చేయనున్నాడు. ఈ లైన్‌లో నాని సినిమా కూడా చేరింది. మొత్తం మూడు ప్రాజెక్ట్స్‌తో నాని రెండేళ్ళ వరకూ బిజీగా ఉన్నాడు.

#nani#nithin#nani-nithinnewmovie#VaishnaviChaitanya
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి