రాజకీయాలు

Ys Jagan: ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులా? ఇదేనా ప్రజాస్వామ్యం.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్

రచన: NK4 నిమిషాల పఠనం

Ys Jagan: వైసీపీ నేతల అరెస్టులపై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల అరెస్టులను ఖండించిన జగన్.. నారాసుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. దాడి చేసిన వారు అధికార పార్టీకి చెందిన వాళ్లైతే వారికి సీఎం చంద్రబాబు రక్షణ కల్పిస్తూ.. బాధితులపైనే కేసులు పెట్టి రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Ys Jagan: వైసీపీ నేతల అరెస్టులపై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల అరెస్టులను ఖండించిన జగన్.. నారాసుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. దాడి చేసిన వారు అధికార పార్టీకి చెందిన వాళ్లైతే వారికి సీఎం చంద్రబాబు రక్షణ కల్పిస్తూ.. బాధితులపైనే కేసులు పెట్టి రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం అని చంద్రబాబును నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ మాత్రం వెనక్కి తగ్గదన్నారు. న్యాయం వైపు నిలబడి అన్యాయాన్ని నిలదీస్తుందని జగన్ తేల్చి చెప్పారు.

ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ ను జగన్ ఖండించారు. విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? అని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడిని అరెస్ట్ చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్‌ ఆఫ్‌ లా అనేది ఉందా? అని అనుమానం కలుగుతోందన్నారు.

శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదే రకంగా అరాచకం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారని ఆరోపించారు. అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారని, ఆ ప్రజాస్పందనను చూసి చంద్రబాబు ప్రభుత్వం భయపడిందని జగన్ అన్నారు.

https://x.com/ysjagan/status/2083904699607220450

#Ys Jagan#Ysrcp#Cm Chandrababu#Mla Virupakshi#Andhra Politics#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి