Devi Sri Prasad: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాక్ స్టార్‌గా దేవిశ్రీ ప్రసాద్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మణిశర్మ తర్వాత తెలుగులో ఆయనను మర్చిపోయేలా ఒక దశలో వరుస సినిమాలను అందుకున్నాడు. సంగీత దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, సింగర్‌గా డీఎస్పీ పొందిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దేవి శ్రీ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్సైయ్యాడంటే సినిమా మ్యూజికల్ గా హిట్టైపోయినట్టే.
ఇలా, ప్రతీ ఒక్కరూ బ్లైండ్ గా నమ్మేస్తారు. అంతేకాదు, సినిమాకి కావాల్సిన ప్రమోషన్స్ దేవి నుంచే వచ్చేది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాక్ స్టార్ చేసే రచ్చతో ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు పెరిగాయి. ఇక, మన స్టార్ హీరోలతో స్టేజ్ మీద స్టెప్పులేయించిన క్రెడిట్ కూడా ఈ రాక్ స్టార్‌దే. అంతేకాదు, కొందరు హీరోలతో పాటలు కూడా పాడించాడు. చిరంజీవి, ఎన్‌టిర్ లాంటి వారు సాంగ్స్ పాడారంటే అది మన డీఎస్పీ పట్టుదలే.
అయితే, ఇంతకాలం గాయకుడిగా.. సంగీతదర్శకుడిగా..సాహిత్యరచయితగా ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా మనముందుకు రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ సినిమాతో దేవి హీరోగా మారాడు. వాస్తవానికి, ఈ సినిమాలో నాని, నితిన్ లలో ఒకరు నటించాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ దేవికి వచ్చింది.

ఇక, తాజాగా ఎల్లమ్మ సినిమా నుంచి దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ వచ్చింది. ఈరోజు ఈ రాక్‌స్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం రెట్రో లుక్ లో ఉన్న దేవి పోస్టర్ను వదిలారు. ఇందులో ఆయన చేతిలో కిరీటం పట్టుకొని సింపుల్ గా ఫార్మల్ కాస్ట్యూం లో పాత సినిమా హీరోలా కనిపిస్తున్నాడు. ఇక, ఎల్లమ్మ లో ఆయన 'పర్షి' అనే పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు, పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, మరో ముఖ్య విషయం ఏమిటంటే ఎల్లమ్మ సినిమాకి దేవినే మ్యూజిక్ అందిస్తుండటం. ఇప్పటికే, ఆయా షేర్ సింగర్ జంగిరెడ్డితో ఓ జాతర సాంగ్ కూడా రికార్డ్ చేశారు.












