Krish Jagarlamudi: క్రిష్ జాగర్లమూడి..ఈ పేరుకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఉంది. సృజనాత్కమైన కథలను వెండితెరమీద ఆవిష్కరించడంలో దర్శకుడు క్రిష్ స్టైలే వేరు అని ప్రముఖులందరూ ప్రశంసించారు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి..ఇలా ఆయన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఆ తర్వాత నుంచే క్రిష్ ట్రాక్ రికార్డ్ మొత్తం దెబ్బ తినింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పీరియాడికల్ మూవీ హరి హర వీరమల్లు సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకి మొదట్లో దర్శకుడు క్రిష్. ఆయన తీసిన సన్నివేశాల వరకూ అద్భుతంగా వచ్చాయి. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల మధ్యలో పంజా వైష్ణవ్ తేజ్ తో కొండపొలం అనే సినిమాను తీశాడు. ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది.
ఆ తర్వాత చేతిలో నుంచి హరి హర వీరమల్లు జారిపోయింది. దాంతో, ఈ సినిమా ఎవరికీ పనికిరాకుండా పోయింది. మధ్యలో వదిలేసిన తర్వాత అనుష్క శెట్టితో ఘాటి చిత్రాన్ని తీశాడు. కానీ, ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో, ఇప్పుడు అంతా కొత్త వాళ్లతో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మరి, ఈ సినిమాతోనైనా క్రిష్ హిట్ కొడతాడా లేదా..అసలు ఇప్పుడు ఆయన తీస్తున్న కథ-కథనాలు ఎలా ఉండబోతున్నాయి..ఎప్పుడు రిలీజ్ ఉంటుంది..ఇలాంటి అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి, ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కొత్త సినిమా కబుర్లు..అప్‌డేట్స్ ఎప్పుడు బయటకి వదులుతాడో..ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.












