King 100-Devi Sri Prasad: అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో టాలీవుడ్ కి కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ రా.కార్తీక్ పరిచయమవుతున్నాడు. కేవలం ఒకే ఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్..నాగార్జున కోసం ఒక అద్భుతమైన మాస్ అండ్ యాక్షన్ సినిమాను రూపొందించే అవకాశం అందుకోవడం టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చకి దారితీసింది.
టాలెంట్ ఎక్కడున్నా పట్టుకొచ్చే నాగార్జున, కథ నచ్చడంతో ఏకంగా తన మైల్ స్టోన్ మూవీ 100వ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడే..అంచనాలు మొదలయ్యాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ సంగీత దర్శకుడెవరనేది వెల్లడి కాలేదు. తాజాగా, ఆ అప్‌డేట్ ని మేకర్స్ ఇచ్చారు. నాగార్జున 100వ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ని టీమ్ ప్రకటించింది.

గతంలో దేవి.. నాగార్జున నటించిన మాస్, మన్మధుడు, కింగ్, ఢమరుకం, కుబేర వంటి చిత్రాలకి అద్భుతమైన ఆల్బంస్ ఇచ్చాడు. వీరి కాంబోలో వచ్చిన పాటలన్నీ పెద్ద హిట్ గా నిలిచాయి. ఇప్పుడు, మరోసారి నాగ్ తన సినిమాకి సంగీతం అందించే ఛాన్స్ దేవికి ఇచ్చాడు. సో, గ్యారెంటీగా కింగ్ 100 మ్యూజికల్‌గా బిగ్ హిట్ అని ఫిక్సవ్వచ్చు. కాగా, తాజాగా..డీఎస్పీ హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ సినిమా నుంచి కూడా లుక్ రిలీజైంది. ఇది, బాగా ఆకట్టుకుంటోంది.
పుష్ప ఫ్రాంఛైజీస్ తో సంగీత దర్శకుడిగా ఇంటర్నేషనల్ రేంజ్ కి చేరుకున్నాడు. ఇప్పటికే, మెగాస్టార్..వెంకటేష్..బాలకృష్ణ..నాగార్జున.. ఎన్‌టిర్..రామ్ చరణ్, ప్రభాస్..అల్లు అర్జున్..ఇలా టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సినిమాలకి మ్యూజిక్ అందించాడు. తమిళంలోనూ రాక్ స్టార్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ కి మ్యూజిక్ డైరెక్టర్‌గా సంగీతం అందించాడు. మణి శర్మ, ఎస్ ఎస్ థమన్ లాంటి వారికి ఈ రాక్ స్టార్ గట్టి పోటీ ఇచ్చిన సందర్భాలెన్నో ఉన్నాయి.












