National

Kurkure Packet: తీవ్ర విషాదం.. ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసిన కుర్‌కురే.. పేరెంట్స్ బీ‌కేర్‌ఫుల్

రచన: NK4 నిమిషాల పఠనం

పసి పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్లు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారో ఇలాంటి అంశాలన్నీ కనిపెట్టుకుని ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు. పిల్లలు అడిగారనో, ముచ్చట పడ్డారనో ఏది పడితే అది వారికి కొనివ్వడం కరెక్ట్ కాదు. అందులో పొంచి ఉన్న ప్రమాదాలను కూడా అంచనా వేయాలి. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. కుర్ కురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది.

Kurkure Packet: పసి పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్లు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారో ఇలాంటి అంశాలన్నీ కనిపెట్టుకుని ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు. పిల్లలు అడిగారనో, ముచ్చట పడ్డారనో ఏది పడితే అది వారికి కొనివ్వడం కరెక్ట్ కాదు. అందులో పొంచి ఉన్న ప్రమాదాలను కూడా అంచనా వేయాలి. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. కుర్ కురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది.

కర్ణాటకలోని మైసూరులో ఈ ఘోరం జరిగింది. కుర్‌కురే తింటుండగా అందులో వచ్చిన ప్లాస్టిక్ గిఫ్ట్ బాల్‌ను కూడా బాలుడు మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే బాబుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే పిల్లాడు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదించారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.

బాబు పేరు ముకుంద్ మయూర్. వయసు ఐదేళ్లు. సంతోష్, ఐశ్వర్యలకు ఏకైక సంతానం. పిల్లాడు అడిగాడని తల్లిదండ్రులు కుర్ కురే కొనిచ్చారు. అయితే, ఆ ప్యాకెట్ లో ప్లాస్టిక్ గిఫ్ట్ బాల్ కూడా వచ్చింది. అది కూడా తినేది అనుకున్నాడో లేక పొరపాటున జరిగిందో కానీ ప్లాస్టిక్ బాల్ ను కూడా బాబు నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో బాబుకి ఊపిరి ఆడక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కాసేపటికి స్పృహ తప్పాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేసరికి ప్రాణాలు కూడా పోయాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం.

కొన్ని రోజుల క్రితం మైసూరు జిల్లా హున్సూర్‌లోనూ ఇలాంటి ఘోరమే ఒకటి జరిగింది. ఇంట్లో పూజ కోసం ఉంచిన ఎండిన మందార పువ్వు గొంతులో ఇరుక్కుపోవడంతో ఆరున్నర నెలల పసికందు మరణించింది. ఈ ఘటన దొడ్డహెజ్జూరు గ్రామంలో జరిగింది. చిన్మయ్ గౌడ ఆడుకుంటోంది. ఆ సమయంలో ఇంటి గుమ్మం వద్ద ఉంచిన ఎండిన పువ్వును తీసుకుని నోట్లో పెట్టుకుని మింగేసింది. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక పసికందు చనిపోయింది.

#Kurkure Packet#Karnataka#Swallow#Toy Ball#Die#Plastic Gift Ball#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి