తెలంగాణ

Congress : మంత్రి దామోదర ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్ ఆగ్రహం.. ఏఐసీసీకి నివేదిక!

5 నిమిషాల పఠనం

అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రతరం అవుతోంది. ఒకరి తర్వాత మరొకరు అన్న చందంగా నేతలు తగవులాడుకుంటున్నారు. సమన్వయంతో పనిచేయాలని పార్టీ అధిష్టానం సూచించినా మాకేం పట్టదు అన్న విధంగా నేతలు ప్రవర్తిస్తున్నారు. ఓవైపు మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య పంచాయితీ నడుస్తుండగా.. మరోవైపు మంత్రి దామోదర వర్సెస్ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు మధ్య బూతుపురాణం మొదలైంది.

అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రతరం అవుతోంది. ఒకరి తర్వాత మరొకరు అన్న చందంగా నేతలు తగవులాడుకుంటున్నారు. సమన్వయంతో పనిచేయాలని పార్టీ అధిష్టానం సూచించినా మాకేం పట్టదు అన్న విధంగా నేతలు ప్రవర్తిస్తున్నారు. ఓవైపు మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య పంచాయితీ నడుస్తుండగా.. మరోవైపు మంత్రి దామోదర వర్సెస్ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు మధ్య బూతుపురాణం మొదలైంది. అది కాస్త భౌతిక దాడుల వరకు వెళ్లినట్టు చర్చ జరుగుతోంది.

అయితే, ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్‌లో మంత్రి దామోదర, ఎమ్మెల్యే కాంతారావు మధ్య నెలకొన్న వివాదంపై తేల్చేందుకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు గాంధీభవన్ రావాలని మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే లక్ష్మికాంతరావుకు మొన్నసాయంత్రం నోటీసులు పంపారు. అయితే, నిన్న ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాల్సి ఉండగా మంత్రి దామోదర రాలేదు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే కాంతారావు విచారణ ఉండగా.. మంత్రి రాలేదని ఆయన కూడా హ్యాండ్ ఇచ్చినట్టు తెలిసింది.

దీంతో చేసేదేమీ లేక టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీభవన్ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. విచారణకు రాకుండా హ్యాండ్ ఇచ్చిన వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పార్టీ సీడబ్ల్యూసీ శాశ్వత మెంబర్, మంత్రి దామోదర రాజనరసింహ, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్ర నివేదికను పంపేందుకు పీసీసీ చీఫ్ సిద్దమైనట్టు తెలుస్తోంది.

ఇద్దరు నేతల మధ్య ఢిల్లీలో జరిగిన పంచాయితీ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా మారడంతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.క్రమశిక్షణతో ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, పార్టీ పిలుపును సైతం ఖాతరు చేయకపోవడంపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఇద్దరు నేతల ప్రవర్తనపై సమగ్ర సమాచారంతో కూడిన నివేదికను ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి పంపించేందుకు సిద్ధమైనట్టు పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కాగా, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి నియామకంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తన వర్గానికి చెందిన నేతకు మద్దతు తెలిపారని, పక్క జిల్లా ఎమ్మెల్యే అయి ఉండి తన జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై మంత్రి దామోదర ఆగ్రహంతో ఢిల్లీలోని హోటల్ గదిలో ఎమ్మెల్యేను తీవ్ర పదజాలంతో దూషించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

#Tpcc cheif mahesh goud#AICC#minister damodara rajanarsimha#mla laxmi kantarao#disiplinary action#report to delhi#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి