పెద్ద నోట్ల రద్దు మాదిరిగా కేంద్రంలోని మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలో ఆధార్ వ్యవస్థలో సమూళ మార్పులకు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రరాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్‌కు లబ్దిదారులను ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ఆధార్ నెంబర్‌నే అన్ని పథకాలకు అటాచ్ చేయడం, ఈకేవైసీ అనుసంధానం వంటివి జరిగాయి.కానీ,ఇప్పుడు ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీని తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) ఇటీవల జరిగిన 'పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ 2026-27 'జాతీయ వర్క్‌షాప్‌లో ఈ అంశాన్ని వెల్లడించారు. ఆధార్ కార్డులు సులభంగా అందుబాటులోకి వస్తున్నందున వెరిఫికేషన్ కోసం ఓటర్ ఐడీ నంబర్, బయోమెట్రిక్ ఉపయోగించనున్నట్లు తెలిపారు.
ఎస్ఐఆర్ ఎఫెక్ట్..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. డూప్లికేట్, దొంగ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, పర్మినెంట్‌గా అడ్రస్ మారిన వారి ఓట్లను కేంద్రఎన్నికల సంఘం తొలగిస్తోంది. దీంతో ఫైనల్ లిస్టు రెడీ చేసి ఓటర్ నంబర్ ఆధారంగా స్కీమ్స్ అమలు చేయనున్నారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే, లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చెల్లింపుల విషయంలో కొత్త విధానం తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.
ఆధార్ బదులు బయోమెట్రిక్ ధ్రువీకరణ..
ఇంతకాలం ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంటుతో లింగ్ చేసి లబ్దిదారులకు పెన్షన్, పీఎఫ్ సొమ్ము, రైతు కిసాన్ డబ్బులు, మహిళలకు ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో కేంద్రం జమచేసింది.అయితే, దేశ పౌరులు కానీ వారు కూడా కొందరు ఆధార్ కార్డులు పొందారు. స్థానిక నేతల సాయంతో, డబ్బులు చెల్లించి ఆధార్ కార్డు పొంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ది పొందుతున్నట్టు కేంద్రం గుర్తించింది.ఈ క్రమంలోనే ముందుగా ఎస్ఐఆర్లో భాగంగా ఓట్లు డిలీట్ చేసే ప్రక్రియ చేపట్టింది. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆధార్ బదులుగా బయోమెట్రిక్ ధృవీకరణ, ఓటర్ ఐడీ వినియోగంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఓటర్ ఐడీని ప్రమాణికంగా తీసుకుని బయోమెట్రిక్ సిస్టమ్ తెచ్చినా కొన్ని ఇబ్బందులు తప్పవని పలువురు అంచనా వేస్తున్నారు.
ఒక వ్యక్తికి ఆధార్ నంబర్ ఒక్కటే ఉంటుంది.కానీ, ఓటర్ ఐడీ మాత్రం వేర్వేరు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ ఐడీ ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు చేపడితే కొత్త సమస్యలు ఉత్పన్నం కావొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే SIR పేరుతో 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించారని, ఓటరు జాబితాల్లో పేరు లేనివారు(అర్హుల) పరిస్థితి ఏంటి? అని నిలదీస్తున్నారు.
దేశవ్యాప్తంగా చర్చ..
ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీకి ప్రాధాన్యం ఇవ్వడంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.ఇప్పటివరకు ఆధార్ వ్యవస్థ కోసం రూ.13,633 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇన్నేళ్లుగా ఆధార్‌పై పెట్టిన వేల కోట్ల ఖర్చు వృథా కానుందా? అని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కాగా,
ఆధార్ స్థానంలో ప్రత్యామ్నాయ ధృవీకరణ విధానం తీసుకురావడంపై జోరుగా చర్చ మొదలైనట్టు తెలుస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.కాగా,2014లో మోడీ సర్కార్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పెద్దనోట్లు రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.సుమారు 6నెలల పాటు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద డబ్బులు కోసం పడిగాపులు కాసిన విషయం తెలిసిందే.
ప్రతిపక్షాల విమర్శలు
ఈ ప్రతిపాదనను కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఇతర విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన పేదలకు రేషన్, ఉపాధి హామీ, ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు అందకుండా చేసేందుకు ఇది ఒక కుట్ర అని ఆరోపిస్తున్నాయి. కాగా, కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కేంద్రంలోని మోడీ సర్కార్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.


