క్రైమ్

రెండు టైర్లు పేలి డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. తప్పిన ముప్పు!

4 నిమిషాల పఠనం

జాతీయ రహదారి 44(NH44)పై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా ఫ్లైఓవర్‌పై శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరు నుంచి పీఆర్‌ఎల్‌ (PRL) ట్రావెల్స్ బస్సు సుమారు 36మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరింది.

 జాతీయ రహదారి 44(NH44)పై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా ఫ్లైఓవర్‌పై శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరు నుంచి పీఆర్‌ఎల్‌ (PRL) ట్రావెల్స్ బస్సు సుమారు 36మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో సరిగ్గా అలంపూర్ చౌరస్తా ఫ్లైఓవర్‌పైకి రాగానే బస్సు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.

 దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను వేగంగా ఢీకొట్టి, అదుపుచేయలేక అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ అనుకోని ప్రమాదంతో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేవలం ఒక్కరికి మాత్రమే స్వల్పగాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

 ప్రమాద సమయంలో ఎదురుగా ఇతర వాహనాలు వస్తన్నట్లయితే పెను ప్రమాదం జరిగి ఉండేదని, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు, స్థానికులు మీడియాతో తెలిపారు. బస్సు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టినప్పటికీ, ఫ్లైఓవర్ క్రింద పడకుండా అవతలి రోడ్డుపై నిలకడగా ఆగడంతో ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 దెబ్బతిన్న బస్సును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అదేవిధంగా స్వల్పగాయాలైన వ్యక్తిని తక్షణం చికిత్స అందించడంతో పాటు మిగిలిన ప్రయాణికులను సురక్షితంగా ఇతర వాహనాల్లో వారి గమ్యస్థానాలకు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారులపై తిరిగే ప్రయాణ వాహనాల ఫిట్‌నెస్ లోపించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 సుదూర ప్రాంతాలకు నడిచే బస్సుల టైర్లు, బ్రేకులు ఇతర సాంకేతిక భాగాలను ఆర్టీఏ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొద్దిపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలిగొనే ప్రమాదం ఉన్నందున, ప్రయాణాల భద్రత విషయంలో ట్రావెల్స్ యాజమాన్యాలు కఠినమైన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

#NH44BusAccident2026#AlampurChowrasthaNews#GadwalNewsTelugu#PRLTravelsBusTyreBurst#HighwayAccidentTelangana#NationalNewsTelugu#HydNewsTelugu#CrimeNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి