తెలంగాణ

ఒక్క ఎకరం అమ్మినట్లు నిరూపించినా ఊడిగం చేస్తా.. ఎమ్మెల్యే సవాల్!

4 నిమిషాల పఠనం

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని భూముల విక్రయాల వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కూకట్‌పల్లి ప్రాంతంలో తాను గానీ తన కుటుంబసభ్యులు గానీ ఒక్క ఎకరం భూమిని అమ్ముకున్నట్లు నిరూపించినా.. ప్రభుత్వంలోని పెద్దల ఇళ్లలో ఊడిగం చేయడానికి సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని భూముల విక్రయాల వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కూకట్‌పల్లి ప్రాంతంలో తాను గానీ తన కుటుంబసభ్యులు గానీ ఒక్క ఎకరం భూమిని అమ్ముకున్నట్లు నిరూపించినా.. ప్రభుత్వంలోని పెద్దల ఇళ్లలో ఊడిగం చేయడానికి సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఎంతో కష్టపడి, పోరాడి సాధించిన మియాపూర్ భూములను ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తోందన్నారు. కోర్టు ఆర్డర్ కాపీ రాకముందే ఆ భూములను వేలం వేయడానికి కాంగ్రెస్ పెద్దలు సిద్ధపడడం దారుణమని మండిపడ్డారు.

హైదరాబాద్‌లోని మియాపూర్, కూకట్‌పల్లి, హౌసింగ్ బోర్డు పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఈ భూములన్నీ పూర్తిగా నిరుపేదలకు, ప్రజా సంక్షేమానికి చెందాల్సినవని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఆయనకు హైదరాబాద్ మహానగరంపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు.

నగర భౌగోళిక పరిస్థితులు, స్థానిక సమస్యలపై స్పష్టత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం తగదని హితవు పలికారు. ఒకవైపు నగరంలోని చెరువుల అభివృద్ధి కోసమని రూ.50కోట్లు ఖర్చు పెడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, మరోవైపు వెలకట్టలేని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మి సొమ్ము చేసుకుంటోందని మాధవరం ఆరోపించారు. చెరువులను కాపాడుతామని చెప్పే ప్రభుత్వ పెద్దలు, విలువైన భూముల బకాసుర భక్షణకు పాల్పడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

పేద ప్రజలకు చెందాల్సిన భూముల అమ్మకాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, దీనిపై తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక భూముల పరిరక్షణ, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భూముల వేలం ప్రక్రియపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

#MadhavaramKrishnaRaoChallenge#KukatpallyLandsRow#MiyapurLandAuction#PonnamPrabhakarVskrihsnaRao#BRSvsCongressTelangana#HydNewsTelugu#TelanganaNewsTelugu#PoliticalNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి