జాతీయం

National : ‘సిటిజన్ షిప్’ రాకుండానే సోనియా గాంధీకి ఓటు..!

4 నిమిషాల పఠనం

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరో బిగ్ షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటలీ పౌరసత్వం ఉన్న ఆమె దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని వివాహం చేసుకుని ఇండియాకు వచ్చిన సమయంలో ఆమెకు పౌరసత్వం కంటే ముందే ఓటు హక్కు వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరో బిగ్ షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటలీ పౌరసత్వం ఉన్న ఆమె దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని వివాహం చేసుకుని ఇండియాకు వచ్చిన సమయంలో ఆమెకు పౌరసత్వం కంటే ముందే ఓటు హక్కు వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి భారతీయ పౌరులు కాని వారు ఎవరికీ పౌరసత్వం రాకముందు ఓటు హక్కు రాకూడదు. కానీ,భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఆమె ఓటు హక్కు కలిగి ఉన్నారని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే భారత పౌరసత్వం పొందకముందే ఓటరు జాబితాలో సోనియా గాంధీ పేరును చేర్చారనే వివాదంలో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ వ్యవహారంలో అదనపు ఆధారాలు, పత్రాలను సమర్పించేందుకు ఫిర్యాదు దారుడికి కోర్టు అనుమతి మంజూరు చేసింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.

పిటిషనర్ ఆరోపణ ఏంటంటే?

1983లో సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందారని.. కానీ, అంతకంటే ముందే (1980 ఓటరు జాబితాలో) న్యూఢిల్లీ నియోజకవర్గం పరిధిలో ఆమె పేరు నమోదు అయిందని వికాస్ త్రిపాఠి అనే ఫిర్యాదు దారుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సోనియా పేరును ఓటరు జాబితాలో చేర్చారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని వేడుకున్నాడు. దీంతో పైన పేర్కొన్న విధంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది.

సోనియా వెర్షన్ ఏంటంటే?

వికాస్ త్రిపాఠి చేస్తున్నవి కేవలం ఆరోపణలే అని సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమైనదని, చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని ఆమె తరపు లాయర్లు వాదించారు. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా కేవలం ఊహాగానాల ఆధారంగానే పిటిషనర్ ఈ పిల్ వేశారని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. గతంలో మెజిస్ట్రేట్ కోర్టు ఈ ఫిర్యాదును తిరస్కరించగా, పిటిషనర్ రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.

మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు సెషన్స్ కోర్టుకు విన్నవించగా.. ఈ కేసును తిరిగి తాజాగా విచారించాలని మేజిస్ట్రేట్ కోర్టును సెషన్స్ కోర్టు ఆదేశించింది. అయితే, న్యాయస్థానం ఫిర్యాదుదారునికి తన వాదనలను బలోపేతం చేసేందుకు అదనపు పత్రాలను సమర్పించే అవకాశాన్ని ఇవ్వడంతో, నవంబర్ 18న జరగబోయే తదుపరి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంలో సోనియా గాంధీ నిజంగానే దోషిగా తేలుతారా? లేదా బయట పడతారా? అనేది తెలియాల్సి ఉంది.

#Sonia gandi#Aicc chairperson#citizenship#india#national#voter id#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి