Tollywood: మన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, సిల్వర్ స్క్రీన్ మీద అందంగా కనిపించేందుకు హీరోయిన్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఫిట్నెస్, డైట్, వర్కవుట్స్ అంటూ తమ శరీరాకృతిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఒకప్పుడు కొంతమంది హీరోయిన్స్ జీరో సైజ్ అంటూ బక్కపలచగా మారారు. దానివల్ల అవకాశాలను కోల్పోయారు. మళ్ళీ జీరో సైజ్ ట్రెండ్ మొదలైంది. అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలినీ పాండే తాజాగా షేర్ చేసిన పిక్స్ చూసి అవాక్కవుతున్నారు.
హీరోయిన్స్ నాజూగ్గా కనిపించాలనే ప్రయత్నంలో బక్కపలచగా మారిపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నా కూడా సన్నగా తయారై ఫొటో షూట్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్ల అందం విషయంలో బొద్దుగా ఉండటం కూడా ప్రత్యేక ఆకర్షణగా కనిపించేది. ముఖ్యంగా, తమిళ తంబీలకి బొద్దుగా ఉండే హీరోయిన్సే చాలా ఇష్టం. వారు గనక తమిళంలో ఓ హిట్ కొడితే ఈ తంబీలు ఏకంగా గుడి కట్టేసేవారు.
కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. స్లిమ్ లుక్, టోన్డ్ బాడీ, జీరో సైజ్ అంటూ కొత్త అందాల ప్రమాణాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా, గ్లామర్ పాత్రలు చేసే హీరోయిన్లు తమ ఫిజిక్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ, దీని కోసం చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు వికటించి ప్రాణాలపైకి వస్తున్నాయి. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క శెట్టి కావాల్సినంత బొద్దుగా తయారైంది. కానీ, ఆ సినిమా తర్వాత ఇప్పటికీ ఆ బాధను అనుభవిస్తోంది. క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.
సైజ్ జీరో కోసం ప్రయత్నించిన ఇలియానా..మరీ పీలగా తయారైంది. ఆమెకి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో అవకాశాలు లేకుండా పోయాయి. ఇప్పుడు, క్యూట్‌గా చబ్బీగా ఉండే శాలినీ పాండే కూడా బక్కపలచగా మారింది. ఆమె లేటెస్ట్ ఫొటోస్ చూసిన అభిమానులు..మాకు అర్జున్ రెడ్డిలో ప్రీతినే బాగా నచ్చింది. శాలినీ పాండే నచ్చలేదు. కాస్త బొద్దుగా అవండీ.. అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి, బ్యూటీకి వస్తే హిందీలో ఒకటి అరా అవకాశాలు రావచ్చేమో గానీ, తెలుగు-తమిళ భాషల్లో మాత్రం అసలు ఛాన్సే లేదు.


