తెలంగాణ

Hyderabad : ఒకటే బకెట్ వాటర్.. స్నానం చేయొద్దని కండిషన్.. యువతి పోస్టు వైరల్!

4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో నీటి సమస్య ఎంతలా ఉందో తేల్చి చెప్పే ఉదంతం ఇది. సమ్మర్ రాకముందే హాస్టల్స్, ఇంటి ఓనర్స్ రెంట్‌కు ఉండే వారికి నీళ్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గట్టిగా అడిగితే నీళ్లు రాకపోతే మేం ఏం చేయాలి? అంటూ రివర్స్ అవుతున్నారని అద్దెకు ఉంటున్న వారు వాపోతున్నారు.

హైదరాబాద్ మహానగరంలో నీటి సమస్య ఎంతలా ఉందో తేల్చి చెప్పే ఉదంతం ఇది. సమ్మర్ రాకముందే హాస్టల్స్, ఇంటి ఓనర్స్ రెంట్‌కు ఉండే వారికి నీళ్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గట్టిగా అడిగితే నీళ్లు రాకపోతే మేం ఏం చేయాలి? అంటూ రివర్స్ అవుతున్నారని అద్దెకు ఉంటున్న వారు వాపోతున్నారు. చదువుకునే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఈ పరిణామాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.

ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవలేదు. ఫలితంగా నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ అడుగంటిపోయినట్టు జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు చెబుతున్నారు.దీంతో బోర్లలో నీరు లేక కేవలం వాటర్ ట్యాంకర్ల ద్వారా జీవనం గడుపుతున్నారు. నగరంలోని జంట జలాశాయాల్లో ఉన్న నీటిని కేవలం తాగు కోసమే వినియోగిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఫలితంగా రోజువారీ వినియోగానికి నీరు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

నీటి కొరత కారణంగా నగరంలోని పలు విద్యాసంస్థలు, కాలేజీలకు ఇప్పటికే హాలిడేస్ ఇచ్చి ఇండ్లకు పంపించారు. ఈ క్రమంలోనే పీజీ హాస్టళ్లలో నెలకొన్న దుర్భర పరిస్థితిపై ఓ యువతి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రోజుకు ఒక బకెట్ నీళ్లు మాత్రమే ఇస్తున్నారని సదరు విద్యార్థిని చెబుతోంది.దీనికి తోడు కండిషన్స్ కూడా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ బకెట్ నీటిని పొదుపుగా వాడుకోవాలని చెబుతున్నారని, స్నానం చేయొద్దని అంటున్నారని, కేవలం ఎమర్జెన్సీ అవసరాలకు మాత్రమే వాడుకోవాలని అంటున్నారని వాపోయింది.

అడిగితే రెండు రోజుల వరకు నీళ్లు రావని, ట్యాంకర్స్ రావడం లేదని చెబుతున్నారని పేర్కొంది. మోటర్ వేయాలని అడితే వేయడం లేదని వెల్లడించింది. ఆ బకెట్ నీళ్లు కూడా హాస్టల్‌లో కిందికి వెళ్లి తీసుకురావాలని ఆందోళన వ్యక్తం చేసింది. నీళ్లు రావడంలేదని ఆఫీస్‌లో లీవ్ పెడదామంటే మేనేజర్‌కు ఆ కారణం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. హాస్టల్‌లో ఫీజులు కట్టిన తరవాత నీళ్లు రాకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. కాగా, దీనిపై అటు జలమండలి అధికారులు, ఇటు ప్రవేటు హాస్టల్స్ ఓనర్స్ స్పందించాలని నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.

#hyderabad#water problems#PG hostels#young girl post viral#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి